తిరుమలలో సర్వదర్శనానికి 14 గంటల సమయం..ఇన్ని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చి వెళుతూ ఉంటారు.

అందువల్ల తిరుమలలో ఎప్పుడూ భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది.

శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుని వెళుతూ ఉంటారు.అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు శ్రీవారికి తల నీలాలను సమర్పించి వెళుతూ ఉంటారు.

అదే విధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు మన రాష్ట్రాలలోనే కాకుండా దేశ నలు మూలల నుంచి వచ్చిన భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అధికారులు వెల్లడించారు.స్వామి వారినీ మంగళవారం రోజు దాదాపు 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.అంతే కాకుండా స్వామి వారికి దాదాపు 24 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని వెల్లడించారు.

Advertisement

అంతే కాకుండా శ్రీ వారికి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం నాలుగు కోట్లు వచ్చిందని దేవస్థానం అధికారులు వెల్లడించారు.తిరుమలలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా మంగళవారం రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజా గోపాలస్వామి వారి అలంకారంలో చంద్రకోలు దండం ధరించి కల్ప వృక్ష వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు.ఇంకా చెప్పాలంటే స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించగా వాహనం ముందు భక్త జన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్6, బుధవారం2024
Advertisement

తాజా వార్తలు