Tinnu Anand Prabhas : ప్రభాస్ వల్లే తొలిసారి అలాంటి అనుభూతిని పొందాను.. టీనూ ఆనంద్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ దర్శకుడు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లొ తాజాగా తెరకెక్కిన చిత్రం సలార్( Salaar ).

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమా పడింది.ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్, అలాగే మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో టీనూ ఆనంద్( Tinnu Anand ) కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.తాజాగా ఆయన సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ డార్లింగ్ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా టీనూ ఆనంద్ మాట్లాడుతూ.ఓ రోజు నేను, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఆయన భార్య, ప్రశాంత్‌ నీల్‌( Prashanth Neel ) సలార్‌ సెట్స్‌లో ల్యాప్‌టాప్‌లో టీజర్‌ చూశాం.అందులో తన పాత్రకు నేనిచ్చిన ఎలివేషన్‌కు ప్రభాస్‌ ఫిదా అయ్యారు.

Advertisement

వెంటనే నా దగ్గరకు వచ్చి హగ్‌ చేసుకున్నారు.టీజర్‌ మొత్తంలో ఒకే ఒక షాట్‌ తనది.

అయినా టీనూ సర్‌.అదిరిపోయింది అని నన్ను ప్రశంసించారు.

మనం చేసిన పనిని ఎవరైనా నలుగురిలో ప్రశంసిస్తే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కిన స్టార్‌ హీరో ప్రభాస్‌( Prabhas ) పొగిడితే ఎలా ఉంటుంది?

మరోవైపు, టీజర్‌ చూడడం పూర్తయిన వెంటనే ప్రశాంత్‌ ఇప్పుడే దీన్ని విడుదల చేయండి అంటూ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సతీమణి అన్నారు.సెట్స్‌లో ఉన్న ఇతరులు నన్ను అభినందించారు.అప్పుడు నేను పొందిన అనుభూతిని బాలీవుడ్‌లో ఎప్పుడూ పొందలేదు అని చెప్పి భావోద్వేగానికి లోనయ్యారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

సలార్‌ టీజర్‌లో సింపుల్‌ ఇంగ్లిష్‌.అంటూ టీనూ చెప్పిన డైలాగ్‌ విపరీతంగా ఆకట్టుకుంది.

Advertisement

కాగా టీనూ ఈ సినిమాతో పాటు గతంలో పలు తెలుగు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే .

తాజా వార్తలు