'టైగర్ నాగేశ్వరరావు' ఆంధ్ర హక్కులు క్లోజ్.. ఏకంగా అన్ని కోట్లకు అమ్ముడు!

మాస్ మహారాజా రవితేజకు( Ravi Teja ) కెరీర్ లో ఎన్ని ప్లాప్స్ వచ్చినప్పటికీ ఆయన సినిమాలకు హైప్ మాత్రం ఏ మాత్రం తగ్గదు అనే చెప్పాలి.

ఇక క్రాక్, ధమాకా వంటి హిట్స్ పడడంతో మళ్ళీ మాస్ రాజా క్రేజ్ పెరిగింది.

అందులోను రవితేజ మొదటిసారి పాన్ ఇండియన్ సినిమాను చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నాడు.మరి రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao )నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి డిఫరెంట్ ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటూ అంచనాలు పెంచేశారు.

దీంతో ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లింప్స్ అలాగే ఈ మధ్య వచ్చిన టీజర్ తో అంచనాలు డబుల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ తర్వాత టైగర్ పై మరింత హైప్ పెరగడంతో మార్కెట్ లో ఈ సినిమా హక్కులకు డిమాండ్ పెరిగింది.ఈ క్రమంలోనే ఆంధ్ర హక్కులే ఏకంగా 18 కోట్లకు క్లోజ్ అయినట్టు టాక్.వెస్ట్ గోదావరికి చెందిన ఉష బాలకృష్ణ ఈ హక్కులను సొంతం చేసుకున్నారట.

Advertisement

ఇక నైజాం ఏరియాలో ఆసియన్ సినిమాస్ ద్వారా ఓన్ గానే రిలీజ్ చేయనున్నారు.ఇక మిగిలింది సీడెడ్, ఓవర్సీస్.

మేకర్స్ ఓవర్సీస్ లో 4 కోట్ల దాక కోట్ చేయడంతో బయ్యర్లు కాస్త ముందు వెనుక ఆడుతున్నారు.ఇక సీడెడ్ కూడా ఒకటి రెండు రోజుల్లో క్లోజ్ చేసే అవకాశం ఉంది.

టైగర్ నాగేశ్వరరావు సినిమా భారీ పోటీ మధ్య దసరాకు రిలీజ్ కాబోతుంది.బాలయ్య భగవంత్ కేసరితో పాటు విజయ్ లియో సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.

ఈ రెండు సినిమాల కంటే ఈ సినిమా బయోపిక్ గా తెరకెక్కుతుండడంతో కంటెంట్ బలంగా ఉందని నమ్ముతున్నారు.చూడాలి ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో.ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

అలాగే జివి ప్రకాష్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.అలాగే ఈ సినిమాను అగర్వాల్ ఆర్ట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Advertisement

అనుపమ్ ఖేర్( Anupam Kher ), రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

తాజా వార్తలు