మూడు పెళ్లిళ్లు, ముగ్గురు భార్యలు.. జగన్ నోట ప్రతిసారి అదే మాట!

అవకాశం దొరికినప్పుడల్లా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్‌ చేస్తూనే ఉంటారు.

తాజాగా  మూడు రోజుల కడప పర్యటనలో ఉన్న సీఎం జగన్, కమలాపురంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ వ్యక్తిగత జీవితంపై విరుచుకుపడ్డారు.

 పవన్‌కు, చంద్రబాబుకు మధ్య పోలిక పెట్టడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తు వచ్చారు. “నేను చంద్రబాబులా కాదు.

 ఒక ఎన్నికల్లో ఓడిపోతే మరో రాష్ట్రానికి పారిపోను. భార్యలను మార్చే పవన్ కళ్యాణ్ లాగా నేను లేను.

 (ఈ భార్య కాకపోతే మరో భార్య అని కూడా అనడం లేదు)’’ అని జగన్ పవన్, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. 

Advertisement

“ఇది నా రాష్ట్రం, ఇక్కడ నా నివాసం, ఇక్కడ నా గౌరవం,  ఐదు కోట్ల మంది ప్రజలు నా కుటుంబం, నా రాజకీయ జీవితం అరంభం కూడా  ఇక్కడే ఉంది.నా ఆనందం ఏపీ ప్రజలతోనే   మీరందరూ తేడా గమనించవలసిందిగా కోరుతున్నాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడు ఎలా ఉండాలో చెప్పేవాడిని.

అది నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి’’ అని జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతం అమలు చేసిందని ముఖ్యమంత్రి అన్నారు.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జగన్ విరుచుకుపడడడం మరోసారి హట్ టాఫిక్‌గా మారింది.గతంలోనూ  జగన్ ఇలానే  పవన్‌పై విమర్శలు చేయగా ఈ వ్యాఖ్యలను పలువురు నాయకులు తప్పు పట్టారు.

పవన్ టార్గెట్ చేయాలంటే జగన్ ఆ ఒక్క అంశమే దొరికింది.రాజకీయ ప్రత్యర్ధిపై రాజకీయంగా టార్గెట్ చేయాిలి కానీ ఇలా వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడమేమిటంటూ జగన్‌ను తప్పుపట్టారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

  ముగ్గురు భార్యలంటూ వైసీపీ నేతలు కూడా పవన్‌పై దాడి చేయగా, ఏపీ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ తప్పు పట్టింది.

Advertisement