పెట్టుబడి పెడితే.. భారీగా లాభాలు ఇస్తామని, ఎన్ఆర్ఐకి రూ.50 లక్షల మేర టోకరా

అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐని మోసం చేసిన కేసులో కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన కిరణ్ కుమార్, మురళీధర్, మనోజ్‌లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

వీరంతా ఓ ఐటీ శిక్షణా సంస్థను నడుపుతామని తన వద్ద నుంచి డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదని సదరు ప్రవాస భారతీయుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వివరాల్లోకి వెళితే.బెంగళూరుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్న పుదుచ్చేరికి చెందిన కార్తీక్ రాజగోపాలన్ (43) ఆమె ద్వారా అనుమానితుడితో పరిచయమయ్యాడు.

కార్తీక్ అమెరికాకు వెళ్లడానికి ముందు 2009 నుంచి 2019 మధ్య సింగపూర్‌లో బ్యాంకింగ్ రంగంలో పనిచేశాడు.ఈ క్రమంలో కిరణ్ 2017లో రాజగోపాలన్‌కు ఫోన్ చేసి తాను ఒక ఐటీ ట్రైనింగ్ సెంటర్‌ను నడపాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

కిరణ్ తన స్నేహితులు మురళీధర్, మనోజ్‌లు ఇప్పటికే ఐటీ ట్రైనింగ్ కంపెనీని నడుపుతున్నారని.నష్టాలు రావడంతో దానిని మూసేద్దామని అనుకుంటున్నారని కార్తీక్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

ఆ సంస్థలో పెట్టుబడి పెడితే లాభాలు చూపిస్తానని రాజగోపాలన్‌ని కిరణ్ ఒప్పించాడు.అనంతరం రాజగోపాలన్ ఇద్దరు అనుమానితులను ఈమెయిల్ ద్వారా సంప్రదించాడు.ఈ నేపథ్యంలో వారు వ్యాపారం చేసేందుకు రూ.50 లక్షల పెట్టుబడి పెట్టాలని కోరారు.ఈ పెట్టుబడికి 2 శాతం రాబడి అందిస్తామని వారు హామీ ఇచ్చారు.వీరి మాటలను నమ్మిన రాజగోపాలన్‌ నవంబర్ 21, 2017న 88,813 సింగపూర్ డాలర్లను (భారత కరెన్సీలో రూ.50 లక్షల పైనే) మురళీధర్, మనోజ్‌లు చెప్పిన కంపెనీ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు.కానీ వారు కార్తీక్‌కు ఎలాంటి రిటర్న్‌లు ఇవ్వలేదు.

కొంతకాలం వెయిట్ చేసిన ఆయన.వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారిని సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు.

ఈ నేపథ్యంలో రాజగోపాలన్ 2020 ఫిబ్రవరిలో భారతదేశానికి వచ్చినప్పుడు అనుమానితులను కలిశాడు.దీంతో వారు ఆయనకు రూ.5 లక్షల చొప్పున ఎనిమిది చెక్కులను ఇచ్చారు.కానీ అవన్నీ బౌన్స్ అయ్యాయి.

దీనిపై రాజగోపాలన్ వారిని సంప్రదించగా.బాకీ తీర్చేందుకు మరికొంత వ్యవధి కావాలంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

దీంతో తాను మోసపోయానని గ్రహించిన కార్తీక్.బెంగళూరులోని జయనగర పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు