జగన్ కు పంటికింద రాయిలా షర్మిల !

వైఎస్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, జగన్ మరియు షర్మిల( Sharmila ) మద్య పచ్చ గట్టి వేస్తే భగ్గుమనెంతలా వివాదం నడుస్తోందని ఇలా రకరకాలుగా వార్తలు చాలాకాలం నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తన అన్న జగన్ తో ఉన్న విభేదాల కారణంగానే షర్మిల తెలంగాణకు షిఫ్ట్ అయి అక్కడ సోతంగా పార్టీ పెట్టిందనే మాట కూడా తరచూ వినిపిస్తూనే ఉంటుంది.

ప్రస్తుతం తెలంగాణ పోలిటిక్స్ తో బిజీ బిజీ గా ఉన్న షర్మిల.తన అన్న వైఎస్ జగన్ తో ఉన్న విభేదాలను ఎప్పుడు ప్రత్యేక్షంగా బహిర్గతం చేయలేదు.

కానీ పరోక్షంగా పలు ఇంటర్యూలలోనూ, మీడియా సమావేశాలలోనూ విభేదాలను తెలిపే విధంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇదిలా ఉంచితే ఏపీ రాజకీయాలతో తనను సంబంధం లేదని చెప్పే షర్మిల అప్పుడప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి చేసే వ్యాఖ్యలు వైసీపీ పార్టీకి మరియు తన అన్న జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయి.ఆ మద్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు షర్మిల.ఇక ప్రస్తుతం జగన్ ఇరకాటంలో పెడుతున్న వివేకా హత్య కేసుపై కూడా తనదైన రీతిలో స్పందించి వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

Advertisement

వైఎస్ వివేకా హత్యకు కారణం కుటుంబ సమస్యలే అని అవినాష్ రెడ్డి( Avinash Reddy ) చెబుతున్నా నేపథ్యంలో.వివేకా హత్యకు కారణం రాజకీయ సమస్యలే కారణమని , కుటుంబ ఆస్తి అంత తన కూతురు సునీతకు ఎప్పుడో రాసిచ్చారని, తన బాబాయ్ ( వివేకా ) హత్య ముమ్మాటికి రాజకీయ కోణంలోనే జరిగిందని షర్మిలా కుండ బద్దలు కొట్టారు.

దాంతో షర్మిల చేసిన వ్యాఖ్యలు తన అన్న వైఎస్ జగన్( YS Jagan ) ను కుదేలు చేస్తున్నాయి.వివేకా హత్యలో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి జగన్ అండగా ఉంటూ వచ్చారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.సీబీఐ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేసింది.

జగన్ కు తెలిసే వివేకా హత్య జరిగిందనే వాదన కూడా నడుస్తోంది.ఈ నేపథ్యంలో వివేకా హత్య పక్కా రాజకీయమే అని షర్మిల వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

మొత్తానికి పాలిటిక్స్ విషయంలో ప్రతిసారి షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముప్పుగా మారుతున్నాయి.మరి రాబోయే రోజుల్లో ఈ అన్నాచెల్లెళ్ల మద్య వివాదం ఇంకెలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు