అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా తలుపు తడుతుందో తెలియదని మన పెద్దవారు అంటుంటారు.
అలా ఓ యువకుడిని అదృష్టమే కాదండోయ్, లక్ష్మీ దేవి కూడా ఎదురొచ్చి మరీ అతని తలుపు తట్టింది.
అది ఎలా అనుకుంటున్నారా.అయితే మీరు ఈ రియల్ స్టోరీ చదవాల్సిందే.
వివరాల్లోకి వెళితే.నిరుపేద కుటుంబంలో పుట్టిన పాకిస్థాన్ సయూద్ అనే యువకుడు, చాలా కష్టపడుతూ వస్తున్నాడు.
ఇక తనకు యుక్త వయసు వచ్చిన తర్వాత కుటుంబ భారం మొత్తం అతని మీద పడింది.దీంతో చేసేది ఏమిలేక చాలా ఉద్యోగాలకు ట్రై చేశాడు.
కానీ అన్నింటా నిరాశే ఎదురయ్యింది.ఈ క్రమంలో అతను దుబాయ్ వచ్చి, అక్కడి ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేరాడు.
అక్కడే పని చేస్తూ నెలనెలా బాగానే సంపాదిస్తూ, తన సంపాదనను కుటుంబానికి పంపిస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు.ఈ క్రమంలో అతను Mahzooz drawలో పాల్గొన్నాడు.
కాగా తాజాగా తీసిన ఆ డ్రాలో సయూద్‌కు ఏకంగా కేజీ బంగారం లభించింది.దీంతో అతను ఒక్కసారిగా తన అదృష్టాన్ని చూసి స్టన్ అయ్యాడు.
కేజీ బంగారం అనే ఊహనే ఊహించుకోలేకపోయాడు, తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఇక బంగారం తీసుకున్న అతను మాట్లాడుతూ.
నేను కేజీ బంగారం సంపాదించినా ఈ వేయిటర్ జాబ్ మానేయ్యను.ఇందులోనే వర్క్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
అంత బంగారం దొరికినా జాబ్ మీద అతనికి ఉన్న మక్కువను చూసి చాలా మంది ఆ యువకుడిని ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
దీనిపై పలువురు పలు విధాలుగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.కొందరు కష్టపడ్డాడు.
అందుకే అదృష్టం వరించింది అంటూ యువకుడిని పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy