ఈ యువతికి అద్భుతమైన టాలెంట్.. ఒకేసారి 13 బీర్ గ్లాసులను సర్వ్ చేసింది...

సాధారణంగా హోటల్స్ లేదా రెస్టారెంట్స్ లో పనిచేసే స్టాఫ్ చాలా హుషారుగా, చురుగ్గా ఉండాలి.

అలా ఉంటేనే కస్టమర్స్ కి తొందరగా సర్వీస్ చేసి వారిని ఆకట్టుకోగలుగుతారు.

అయితే యజమానులు వెయిటర్ లేదా వెయిట్రెస్ లు కస్టమర్స్ ని ఆకర్శించడానికి కొత్త కొత్త ట్రిక్కులు ఉపయోగించాలి.కొంతమంది స్టాఫ్ తమ టాలెంట్ ని కస్టమర్స్ దగ్గర ప్రదర్శిస్తూనే ఉంటారు.

అలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో బార్ లో పనిచేస్తున్న ఒక యువతి టాలెంట్ ( young ladys talent )చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోను @TansuYegen అనే ట్విటర్ అకౌంటు షేర్ చేసింది.అసలు విషయంలోకి వెళ్తే, జర్మనీలోని మ్యూనిచ్ ( Munich, Germany )లో ఉన్న ఒక బార్ లో పని చేసే మహిళ బార్ కౌంటర్ దగ్గర నిలబడి బీర్ గ్లాసులను సేకరిస్తూ ఉంటుంది.అయితే ఆ మహిళ ఒకేసారి ఏకంగా నిండుగా ఉన్న 13 గ్లాసులను బ్యాలెన్స్ చేసుకుంటూ కస్టమర్ల కు అందించడానికి తీసుకెళ్తుంది.

Advertisement

ఆ 13 బీర్ గ్లాసులను ఏ మాత్రం తొనకకుండా జాగ్రత్తగా కస్టమర్లకి అందించడం తో అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆమె టాలెంట్ కి ఫిదా అయిపోయాడు.దాంతో ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేసాడు.ప్రస్తుతం ఆ వీడియో ని 1.8 మంది చూడగా, 2 లక్షల మంది లైక్ చేసారు.ఈ వీడియో చూశాక యువతీ టాలెంట్ సూపర్ అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మనసు పెడితే ఎవరికైనా, ఏదైనా సాధ్యమవుతుందని ఇంకొందరు మోటివేషనల్ కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు