హెయిర్ రూట్స్ ను సూపర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ గా మార్చే బెస్ట్ టానిక్ మీ కోసం!

జుట్టు రాలడాన్ని అడ్డుకోవాలి అంటే హెయిర్ రూట్స్ ( Hair roots )ని బలోపేతం చేసుకోవడం చాలా అవసరం.

జుట్టు కుదుళ్ళు బలహీనపడితే కురులు చాలా అధికంగా రాలిపోతూ ఉంటాయి.

దాంతో హెయిర్ రోజురోజుకు పల్చగా మారిపోతుంది.ఇటువంటి సమస్యతో మీరు కూడా బాధపడుతున్నారా.? అయితే అసలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ టానిక్ ను కనుక వాడటం అలవాటు చేసుకుంటే మీ హెయిర్ రూట్స్ సూపర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ గా మారడం ఖాయం.

This Tonic Makes Hair Roots Super Strong And Healthy Hair Tonic, Latest News, H

టానిక్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ లవంగాలు,( One teaspoon cloves ) వన్ టీ స్పూన్ మిరియాలు( Pepper ) వేసుకోవాలి.అలాగే రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు( Biryani leaves ), మూడు రెబ్బలు కరివేపాకు మరియు వన్ టీ స్పూన్ మెంతులు ( fenugreek )వేసి ఉడికించాలి.

దాదాపు పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

This Tonic Makes Hair Roots Super Strong And Healthy Hair Tonic, Latest News, H
Advertisement
This Tonic Makes Hair Roots Super Strong And Healthy! Hair Tonic, Latest News, H

ఈ వాటర్ గోరువెచ్చగా అయ్యాక అప్పుడు అందులో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన టానిక్ గా అనేది రెడీ అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ లో ఈ టానిక్ ను నింపుకుని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ టానిక్ ను వాడితే జుట్టు కుదుళ్ళు దృఢంగా ఆరోగ్యంగా మారుతాయి.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

అలాగే ఈ టానిక్ ను వాడటం వల్ల స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.చుండ్రు సమస్య ఉన్న కూడా దూరం అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు