Glowing Face: ఫేషియ‌ల్ అక్క‌ర్లేదు.. ఈ సింపుల్ చిట్కా ముఖాన్ని క్షణాల్లో గ్లోయింగ్ గా మారుస్తుంది!

తమ ముఖ చర్మం గ్లోయింగ్ గా మెరిసిపోవాలని దాదాపు అందరూ కోరుకుంటారు.

అందులోనూ ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి ఉందంటే ముఖ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.

బ్యూటీ పార్ల‌ర్ లో వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేషియల్ చేయించుకుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే కనుక పైసా ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే క్షణాల్లో ముఖాన్ని గ్లోయింగ్ గా మార్చుకోవ‌చ్చు.

ఈ చిట్కా ముందు ఫేషియల్ కూడా వేస్టే.అంత మంచి రిజల్ట్ ను అందిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ బీన్స్, వన్ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత సరిపడా రోజ్‌ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు స్పూన్ తో కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన‌ అనంతరం త‌డి వేళ్ళతో సున్నితంగా చర్మాన్ని రబ్ చేసుకుని చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే కాఫీ పౌడర్, బ్రౌన్ షుగర్, తేనె మరియు రోజ్ వాటర్ లో ఉండే ప్రత్యేక సుగుణాలు ముఖ చర్మాన్ని కాంతివంతంగా మరియు షైనీ గా మారుస్తుంది.అలాగే ఈ చిట్కాను పాటించడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.

చర్మ ఛాయ సైతం మెరుగుపడుతుంది.కాబట్టి ఫేషియల్స్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాను పాటించి ముఖాన్ని కాంతివంతంగా మరియు అందంగా మెరిపించుకోండి.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు