Galou natural :ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మేకప్ అక్కర్లేదు.. సహజంగానే మెరిసిపోతారు!

ఇటీవల కాలంలో చాలా మంది అందంగా కనిపించేందుకు మేకప్ పై ఆధార పడుతున్నారు.కొందరైతే మేకప్ లేకుండా బయట కాలు పెట్టడానికి కూడా ఇష్టపడడం లేదు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను గ‌నుక‌ పాటిస్తే మేకప్ అక్కర్లేదు సహజంగానే అందంగా మరియు కాంతి వంతంగా మెరిసిపోవడం ఖాయం.ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటి అన్నది తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక ఎగ్ ను తీసుకుని బ్రేక్ చేసి ఎల్లో మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ గుడ్డు పచ్చ సొన‌లో వన్ టేబుల్ స్పూన్ నీరు తొల‌గించిన పెరుగును వేసి బాగా మిక్స్ చేయాలి.

చివరిగా వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి అన్నీ కలిసేంత వరకు స్పూన్ తో కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.

Advertisement
This Simple Tip Will Make You Glow Naturally! Simple Tip, Natural Glow, Glowing

ఐదు నిమిషాల పాటు ఆరిన తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని మళ్లీ ఒక సారి అప్లై చేసుకోవాలి.చర్మం పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వేచి ఉండి అప్పుడు నార్మల్ వాటర్ తో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఆపై ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే ముఖం సహజంగానే అందంగా మరియు కాంతివంతంగా మారుతుంది.

This Simple Tip Will Make You Glow Naturally Simple Tip, Natural Glow, Glowing

చర్మంపై మొండి మొటిమలు, మచ్చలు ఉంటే క్రమంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.ముఖ చర్మం టైట్ గా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

మ‌రియు ముఖ చర్మం మృదువుగా సైతం మారుతుంది.ఇన్ని ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించేందుకు ప్రయత్నించండి.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు