ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మొటిమలతో ఇక మదన పడాల్సిన అవసరమే ఉండదు!

టీనేజ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మందిని కలవరపెట్టే చర్మ సమస్యల్లో మొటిమలు ( pimples )ముందు వరుసలో ఉంటాయి.

మొటిమల కారణంగా కొందరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.

మొటిమలను నివారించుకోవడం కోసం రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు.అయినా కూడా ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలియక మదన పడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని పాటిస్తే మొటిమలతో ఇక మదన పడాల్సిన అవసరమే ఉండదు.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు( Red lentils ) వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ), ఒక కప్పు ఎండిన వేపాకు( Dried Neem ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పౌడర్ ను వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ తేనె మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.వేపాకులో ఉండే గుణాలు మొటిమలకు వ్యతిరేకంగా పోరాడతాయి.

మొటిమలు మచ్చలు లేని చర్మాన్ని మీ సొంతం చేస్తాయి.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!
వైరల్ వీడియో : ఏంటి బ్రో హీరోను పుసుక్కున అంత మాటనేశావ్..

అలాగే ఓట్స్ చర్మాన్ని మృదువుగా కోమలంగా మారుస్తాయి.ఎర్ర కందిపప్పు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.చర్మం పై పేరుకుపోయిన మురికి మృత కణాలను తొలగిస్తుంది.

Advertisement

ఫైనల్ గా ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమల బెడద తగ్గడమే కాకుండా చర్మం ప్రకాశవంతంగా మరియు అందంగా మెరిసిపోతుంది.చర్మం ఆరోగ్యంగా మారుతుంది.మచ్చలు తగ్గుతాయి.

మరియు ఫేషియల్ హెయిర్ గ్రోత్ కూడా తగ్గుముఖం పడుతుంది.

తాజా వార్తలు