డ్రై హెయిర్ ను ఒక్క వాష్ లో సిల్కీగా షైనీ గా మార్చే బెస్ట్ రెమెడీ మీ కోసం!

ఒక్కోసారి జుట్టు చాలా డ్రై గా మారిపోతూ ఉంటుంది.కురులు నిర్జీవంగా కనిపిస్తుంటాయి.

అటువంటి జుట్టును( hair ) రిపేర్ చేయడానికి సెలూన్ లో వేలకు వేలు తీసుకుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే పైసా ఖర్చు లేకుండా అది కూడా ఒక్క వాష్ లోనే డ్రై హెయిర్ ను సూపర్ సిల్కీ గా మరియు షైనీ గా మెరిపించుకోవచ్చు.

అందుకోసం ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్( Glass of water ) పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక నాలుగు మందారం పువ్వులు మరియు నాలుగు మందారం ఆకులను ( Hibiscus leaves )తుంచి వేసుకుని మరిగించాలి.

దాదాపు పది నిమిషాల పాటు మరిగించిన తర్వాత వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అరటి పండును స్లైసెస్( Slices the banana ) గా కట్ చేసి వేసుకోవాలి.

Advertisement

అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe vera gel )మరియు ఒక కప్పు మందారం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.

ముఖ్యంగా అరటి పండు, మందారం, అలోవెరా లో ఉండే సుగుణాలు పొడి జుట్టును సమర్థవంతంగా రిపేర్ చేస్తాయి.కురులను సిల్కీగా మరియు షైనీ గా మెరిపిస్తాయి.అలాగే వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.

స్కాల్ప్ క్లీన్ గా మరియు హెల్తీ గా మారుతుంది.చుండ్రు సమస్య దూరం అవుతుంది.

ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్‌కు కీలక పదవి .. టెక్సాస్ గవర్నర్ ఆదేశాలు
పప్పు వండేటప్పుడు సబ్బు లాంటి నురుగు ఎందుకు వస్తుంది.. ఇది ఆరోగ్యానికి హానికరమా..?

జుట్టు ఒత్తుగా దృఢంగా సైతం పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు