మ‌చ్చ‌ల‌ను పోగొట్టి చ‌ర్మాన్ని అద్దంలా మెరిపించే రెమెడీ మీకోసం!

చర్మం పై ఎలాంటి మచ్చ లేకుండా అద్దంలా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.ముఖ్యంగా మగువలు అద్దం లాంటి చర్మం కోసం తెగ ఆరాట పడుతుంటారు.

ఈ క్రమంలోనే ఎన్నెన్నో ఖరీదైన క్రీములు, సీరమ్‌లు వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యం అయ్యే ఉత్పత్తుల‌ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలియదు కానీ.

ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మాత్రం మచ్చల‌ను పోగొట్టి చర్మాన్ని సహజంగానే అద్దంలా మెరిపిస్తుంది.మ‌రి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం మరియు ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరసటి రోజు నానపెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో సహా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.

Advertisement
This Remedy Remove Spots And Makes The Skin Shine Like A Mirror Details! Home Re

రైస్ జ్యూస్ ను స్టైనర్ సాయంతో స‌ప‌రేట్ చేసుకోవాలి.ఆ తర్వాత పల్చటి వస్త్రంలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి అందులో ఉండే వాటర్ ను తొలగించాలి.

This Remedy Remove Spots And Makes The Skin Shine Like A Mirror Details Home Re

ఇప్పుడు ఈ పెరుగులో రెండు టేబుల్ స్పూన్లు రైస్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్‌ టమాటో జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ శెనగపిండి, చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఆపై ఏదైనా మాయిశ్చరైజ‌ర్‌ను రాసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా క్రమంగా దూరం అవుతాయి.మరియు ముఖం అందంగా, కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు