ఈ ఒక్కటి డైట్ లో ఉంటే హెయిర్ ఫాల్ తో చింతే అక్కర్లేదు.. తెలుసా?

హెయిర్ ఫాల్.ఎందరినో తీవ్రంగా కలవరపెట్టే సమస్య ఇది.పైగా కొందరిలో హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి వారు జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక్క రెసిపీని డైట్ లో చేర్చుకుంటే హెయిర్ ఫాల్ తో చింతే అక్కర్లేదు.

మరి ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అనేది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, ఒక్క గ్లాస్ గోరు వెచ్చని పాలు వేసుకొని బాగా కలిపి ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.

ఆ తర్వాత చియా సీడ్స్ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు విత్తనాలు, వన్ టేబుల్ స్పూన్ తరిగిన బాదం, పది నల్ల ఎండు ద్రాక్ష వేసుకోవాలి.

This Recipe Helps To Control Hair Fall Very Effectively Hair Fall, Stop Hair Fa
Advertisement
This Recipe Helps To Control Hair Fall Very Effectively! Hair Fall, Stop Hair Fa

అలాగే ఒక కప్పు యాపిల్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేస్తే మన రెసిపీ సిద్ధమవుతోంది.వారంలో కనీసం మూడు సార్లు బ్రేక్ ఫాస్ట్ లో ఈ రెసిపీని తీసుకుంటే జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రోటీన్ తో సహా ఎన్నో పోషకాలు లభిస్తాయి.అవి జుట్టు రాలడాన్ని చాలా సులభంగా తగ్గిస్తాయి.

This Recipe Helps To Control Hair Fall Very Effectively Hair Fall, Stop Hair Fa

హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్న వారికి ఈ రెసిపీ ది బెస్ట్ అని చెప్పవచ్చు.డైట్ లో ఈ ఒక్క రెసిపీని చేర్చుకుంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.కేవలం కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడం త‌గ్గుముఖం పట్టి ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెసిపీని డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు