ఇదే నా కరోనా ఫిలాసఫీ అంటున్న వర్మ...

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ ఇదే వర్మ రూటే సపరేట్ అన్న విషయం మనకు తెలిసిందే.

నా దారి రహదారి అన్న చందంగా వర్మ లైఫ్ స్టైల్ ఉంటుంది.

అయితే వర్మ లైఫ్ స్టైల్ ను వ్యతిరేకించే వాళ్ళు ఎంత మంది ఉన్నారో, సమర్థించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు.ఎవరు ఏమనుకున్నా నాకు నచ్చినట్టు బ్రతుకుతా, మీరేమన్నా నాకది అవసరం లేదని చెబుతూ తన స్టాండ్ పట్ల చాలా ఖచ్చితంగా ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.

This Is What My Corona Philosophy Says Verma Director Ramgopal Varma, Varma Twe

అయితే కొంచెం లోతుగా ఆలోచిస్తే వర్మ ఒపీనియన్ కూడా కరెక్టే అని చాలా మంది బహిరంగంగా వ్యాఖ్యానించకున్నా అంతర్గతంగా సమర్థిస్తారు.అయితే తాజాగా కరోనా పట్ల నా ఫిలాసఫీ ఇదే అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఫోటోను బట్టి దాని సారాంశం మీకు అర్థమయ్యే ఉంటుంది.2019లో కరోనా లేని సందర్బంలో నెగెటివ్ వ్యక్తులకు దూరంగా ఉండాలనే సామెత ఉండేదని, 2020లో కరోనా వేళ కరోనా పాజిటివ్ వ్యక్తులకు దూరంగా ఉన్నామని, 2021లో అసలు ప్రజలను కలిసేందుకే భయపడుతున్న పరిస్థితులలో ప్రజలనుకలవడానికి ఇష్టపడడం లేదని, ఇక 2022 లో ఇక ప్రజలు ఉండేలా లేరని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు.ఇక వర్మ ఇప్పుడు ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు