అసలైన సంక్రాంతి అంటే ఇదే.. మరి ఈ సంక్రాంతి రహస్యం గురించి తెలుసా..

మకర సంక్రాంతి పండుగ అంటే ఎంతో అందంగా కుటుంబంతో సహా జరుపుకునే పండుగ నిజానికి మకర సంక్రాంతిని సరదాల సంక్రాంతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

చాలామంది ఈ మధ్యకాలంలో సిటీ లైఫ్ కి అలవాటు పడి మన పద్ధతులను పండుగలను మర్చిపోతున్నారు.

అయితే మకర సంక్రాంతిని మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అయితే మనం మకర సంక్రాంతి అని పిలుస్తాం.

కానీ ఇతర రాష్ట్రాలలో పొంగల్ అని పిలుస్తూ ఉంటారు.సంక్రాంతి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో రంగురంగుల ముగ్గులు కనబడుతూ ఉంటాయి.

అలాగనే గొబ్బిళ్ళు, కోడిపందాలు, పిండి వంటలు, గంగిరెద్దులు, భోగిమంటలు, గాలిపటాలు, బసవన్న, హరిదాసు, పాటలు, ఇలా ఎంతో చక్కగా సంక్రాంతి పండుగ ఉంటుంది.సంక్రాంతి సమయానికి రైతుల చేతికి పంట కూడా వచ్చి ఉంటుంది.

Advertisement

పల్లెటూర్లలో అయితే ఎంతో అద్భుతంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.కానీ పల్లెటూర్లలో మాత్రం అదే కళ కనిపిస్తూ ఉంటుంది.

సంక్రాంతి పండుగ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు.అయితే చలి ఎక్కువగా ఉండడం వలన ఇంటి నుంచి బయటకు రావడానికి భోగి మంటలను వేస్తారు.చిన్నారులకు భోగి పండ్లని పోస్తారు.

భోగి పండ్లను పోసే రోజున హరిదాసుని పసి బాలుడిగా మార్చి దేవతలందరూ కలిసి రేగి పండ్లతో అభిషేకం చేస్తారు.కృష్ణ, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ప్రాంతాలలో కోడిపందాలు ఎక్కువగా నిర్వహిస్తారు.

యూకే ఎన్నికల్లో సిక్కు సంతతి ఎంపీల ప్రభంజనం.. అకల్ తఖ్త్ , ఎస్‌జీపీసీ ప్రశంసలు
కాకి తలపై తన్నితే అశుభమా? కాకి మన పై వాలితే తల స్నానం ఎందుకు చేయాలో తెలుసా?

అలాగే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో గాలిపటాల పండుగని చేసుకుంటారు.

Advertisement

గాలిపటాల పండుగని గుజరాత్ లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.మూడవరోజు కనుమ పండుగ రోజు పశువులని అందంగా అలంకరిస్తారు ఆ తర్వాత వాళ్ళ శక్తి మేరకు దానాలు చేస్తూ ఉంటారు.నాలుగో రోజు కనుమ ఈ రోజు మాంసాహారాన్ని అందరూ తింటారు.

ఇలా నాలుగు రోజులు కూడా అందరూ సంతోషంగా, సరదాగా సంక్రాంతిని జరిపి మళ్ళీ తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లిపోతారు.

తాజా వార్తలు