సాధారణంగా కొందరి ముఖ చర్మం ఎలాంటి మచ్చ లేకుండా క్లియర్ గా ఉంటుంది.కానీ కొందరి ముఖం మాత్రం మచ్చలతో నిండిపోతుంది.
ముఖం మొత్తం మచ్చలే ఉంటే ఎంతగానో కలత చెందుతుంటారు.మనో ధైర్యాన్ని కోల్పోతుంటారు.
ఈ క్రమంలోనే మచ్చలను వదిలించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే తీవ్ర ఒత్తిడి( Stress )కి లోనవుతుంటారు.
అయితే ఇకపై అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే చాలా వేగంగా మరియు సులభంగా మచ్చలను నివారించుకోవచ్చు.
క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్( Clear and Glowing Skin ) ను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం మచ్చలు మాయం చేసే ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు తులసి ఆకులు( Tulsi Leaves ), కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్( Muleti Powder ), హాఫ్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్( Neem Powder ), వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.చివరిగా సరిపడా తులసి ఆకుల రసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి మచ్చలైన క్రమంగా మాయమవుతాయి.
కొద్ది రోజుల్లోనే చర్మం క్లియర్ గా మారుతుంది. మొటిమలను( Pimples ) నివారించడానికి కూడా ఈ రెమెడీ సహాయపడుతుంది.
కాబట్టి ఎవరైతే తమ ముఖం మొత్తం మచ్చలే ఉన్నాయని నిత్యం బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy