ఢీ షో ద్వారా డ్యాన్సర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అక్సాఖాన్ ప్రస్తుతం పలు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.తాజాగా ఒక యూట్యుబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అక్సా ఖాన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఒక పర్సన్ నాకు బ్రదర్ లా ఉంటారని ఆయనకు జావిద్ మాస్టర్ ఫ్రెండ్( Javed master ) కావడంతో నాకు ఢీ10 ఛాన్స్ దక్కిందని ఆమె తెలిపారు.
నేను ట్రైన్డ్ డ్యాన్సర్ కాదని అక్సా ఖాన్ అన్నారు.ఢీ10 లో పాల్గొనే సమయానికి నా వయస్సు తక్కువగా ఉన్నా నా టాలెంట్ ను చూసి ఛాన్స్ ఇచ్చారని అక్సా ఖాన్ పేర్కొన్నారు.కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని భావించి తెలుగు నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
చిన్నచిన్నగా ట్రై చేసి తెలుగు నేర్చుకున్నానని అక్సాఖాన్ పేర్కొన్నారు.సౌత్ లో నేను చేసిన రియాలిటీ షో ఢీ10 అని అమె అన్నారు.
నాన్న వ్యాపారవేత్త అని అక్సాఖాన్ ( Aqsa khan )అన్నారు.నేను ఈ స్థాయికి చేరుకోవడం గాడ్ గిఫ్ట్ అని అక్సాఖాన్ వెల్లడించారు.తారక్ నా ఫేవరెట్ అని నేను ఎక్కడ అడిగినా ఇదే సమాధానం చెబుతానని ఆమె అన్నారు.నేను చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ జనతా గ్యారేజ్ అని ఆ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ ఎంతగానో నచ్చిందని అక్సాఖాన్ పేర్కొన్నారు.
నేను ఢీ షో కోసం ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన సాంగ్ పక్కా లోకల్ అని ఆమె తెలిపారు.
జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమాకు సౌత్ లో తాను సక్సెస్ కావడానికి లింక్ ఉందని అక్సాఖాన్ పేర్కొన్నారు.ఢీ షో గ్రాండ్ ఫినాలేకు ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి స్వింగ్ జరా డ్యాన్స్ చేశానని అక్సాఖాన్ పేర్కొన్నారు.తాను ఇసుకపై స్వింగ్ జరా సాంగ్ చేశానని ఆమె అన్నారు.
జై లవకుశ సినిమా కూడా చాలా ఇష్టమని ఆమె వెల్లడించారు.