సరిగ్గా మూడేళ్ళ తరువాత మళ్లీ మొదలైన ఐపీఎల్ -16( IPL-16 ) ఆహుతుల మధ్య అంగరంగ వైభవంగా మొదలైన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో ఈ లీగ్ -16 ఎడిషన్ తాజాగా రెండో దశకు చేరుకుంది.
గత నెల 31న అహ్మదాబాద్ లోని ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయినటువంటి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో మొదలైన ఈ లీగ్.నిరాటంకంగా నెల రోజులు పూర్తి చేసుకుంది.2 నెలల పాటు సాగే ఈ లీగ్ లో ఇప్పటికి ఒక అంకం ముగిసిందని చెప్పుకోవాలి.మొత్తం 74 (లీగ్ 70, ప్లేఆఫ్స్ 4) మ్యాచ్ లు ఉన్న ఈ సీజన్ లో ఆదివారం ముంబై ఇండియన్స్ – రాజస్తాన్ రాయల్స్ ( Mumbai Indians – Rajasthan Royals ) మధ్య 42వ మ్యాచ్ విజయవంతంగా ముగిసింది.

అందుకే కాసేపు దానిపై ఓ రౌండప్ వేద్దాం రండి.మే 28న అహ్మదాబాద్ లో ఐపీఎల్ -16 ఫైనల్ స్టార్ట్ కాగా ఇప్పటివరకు దాదాపు అన్ని జట్లు 8 మ్యాచ్ లు ఆడాయి. పంజాబ్, చెన్నై, రాజస్తాన్, కేకేఆర్( Punjab, Chennai, Rajasthan, KKR ) లు 9 మ్యాచ్ లు పూర్తి చేసుకోగా ప్రతీ జట్టు ఆడే మ్యాచ్ ప్లేఆఫ్స్ రేసులో చాలా కీలకం కానుంది.8 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ టైటాన్స్ .6 గెలిచి 2 మాత్రమే ఓడి 12 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలవడం విశేషం.అదేవిధంగా లక్నో 8 మ్యాచ్ లు ఆడి ఐదింటిలో గెలిచి మూడు ఓడి 10 పాయింట్లతో నెంబర్ 2 దక్కించుకుంది.

రాజస్తాన్, చెన్నైలు ఐతే 9 మ్యాచ్ లు ఆడి 5 గెలిచి నాలుగింటిలో ఓడి తలా 10 పాయింట్లతో 3, 4 స్థానాల్లో రాణిస్తున్నాయి.ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచ్ లలో 4 గెలిచి, 4 ఓడి 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.ముంబై ఇండియన్స్ కూడా అదేమాదిరి 7వ స్థానంలో నిలవగా, ఆర్సీబీ నెట్ రన్ రేట్ ముంబై కంటే కాస్త మెరుగ్గా ఉంది.కాగా ఈ రెండూ మైనస్ లోనే ఉన్నాయి.8వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్.9 మ్యాచ్ లు ఆడి 3 మాత్రమే గెలిచి ఆరింట్లో ఓడిపోవడం జరిగింది.ఇక రాబోయే ఆరు మ్యాచ్ లలో ఏ ఒక్కటి ఓడినా ఢిల్లీ ఈ లీగ్ నుంచి అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్టే అవుతుంది.ప్రస్తుతం ఆయా జట్ల ప్రదర్శనను బట్టి చూస్తే కేకేఆర్, సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లు మాత్రం ప్లేఆఫ్స్ కు చేరుకోవడం కష్టమని బోధపడుతుంది.