ఇటు ప‌వ‌న్.. అటు జూనియ‌ర్.. బాబు సైలెంట్..!!

రాజ‌కీయాల్లో సినీ గ్లామ‌ర్ కూడా ప్ర‌భావం చూపుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తో మొద‌లైన ఈ చ‌రిష్మా ఇప్పుడు బీజేపీ కూడా అదే గ్లామ‌ర్ ని యూజ్ చేసుకోవాల‌ని చూస్తోంది.

ఇక ఏపీలో టీడీపీకి సినీ గ్లామ‌ర్ కొత్తేమి కాదు.ఎన్టీఆర్ తో మొద‌లు పెడితే ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌కు ఆస‌క్తే.

అస‌లు టీడీపీ పుట్టుకే ఒక సినీ నటుడి ద్వారా జరిగింది.ఆరు పదుల వయసులో సినీ రంగాన్ని వ‌దిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్.

వ‌స్తూనే పార్టీ పెట్టి ఏకంగా సీఎం పీఠం ఎక్కారు.అలా టీడీపీకి సినీ గ్లామర్ కంటిన్యూ అవుతూ వచ్చింది.

Advertisement

దానికి పొలిటికల్ గ్రామర్ తెచ్చింది మాత్రం చంద్రబాబే అని చెప్పాలి.బాబు వ్యూహాలు ఆయన చతురతతో టీడీపీని ఈ రోజు వ‌ర‌కు న‌డిపించారు.

అయితే సినీ గ్లామరే టీడీపీకి బలం అదే కొన్ని సార్లు బలహీనత కూడా అవుతోంది.అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని ఫోకస్ పెంచింది.2014 నాటి పొత్తులను కొనసాగించాలనుకుంటోంది.అయితే జనసేన మునుపటిది కాదు దాంతో ఆ పార్టీ నుంచి గట్టిగానే డిమాండ్స్ వస్తున్నాయి.

టీడీపీతో పొత్తు అంటే సీఎం సీటు షేరింగ్ కూడా డిమాండ్ చేస్తున్నారు.దాంతో ఆలోచనలో పడిన టీడ‌పీ చాలా కాలంగా సైలెంట్ గానే ఉంది.మరో సందర్భంలో జనసేనాని మాట్లాడుతూ తనకు వైసీపీ లాగానే టీడీపీ కూడా అన్నారు.

రెండు పార్టీలతో సమాన దూరం పాటిస్తాను అని హాట్ స్టేట్మెంట్ ఇచ్చారు.అయినా కూడా టీడీపీలో ఎటువంటి క‌ద‌లిక క‌నిపించ‌లేదు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్
చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?

ఒక విధంగా టీడీపీ ఈ విషయాల మీద బాగానే కసరత్తు చేసింది అనుకోవాలి.ఎన్టీఆర్ అమిత్ షా భేటీ త‌ర్వాత‌.

Advertisement

ఇక ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ రాజ‌కీయ విష‌యం తీసుకుంటే.రీసెంట్ గా జూనియర్ ని బీజేపీ పెద్దాయన కేంద్రంలో కీలకమైన హోం మంత్రిగా ఉన్న అమిత్ షా డిన్నర్ కి పిలిచి మరీ టీడీపీ శిబిరాన్ని కెలికారు అనే చెప్పాలి.

అలాగే జూనియర్ లో ఎక్కడో దాగి ఉన్న రాజకీయ ఆకాంక్షలను కూడా తట్టిలేపాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నం చేసింది.నిజంగా ఇది టీడీపీకి కంగారు పుట్టించాల్సిన అంశ‌మే.

జూనియర్ గ‌నుక రాజకీయంగా సందడి చేస్తే టీడీపీకి అది ఎంతో కొంత ఇబ్బందే అంటున్నారు.అయితే ఈ విషయంలో కూడా టీడీపీ సైలెంట్ గానే ఉంది.

ఈ ఇష్యూకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని భావించినట్లుగా ఉంది అంటున్నారు.

అయితే ప‌వ‌న్, ఎన్టీఆర్ ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్స్.ఇద్దరూ అశేష తెలుగు జనాలను విశేషంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.మరో వైపు తెలుగుదేశానికి ఇద్దరి అవసరం ఉంది.

అలాగే ఇద్దరూ గతంలో ఆ పార్టీకి తమ వంతుగా సాయం చేసినవారే.అయితే మారిన రాజకీయాల‌ నేపథ్య‌లో టీడీపీ సినీ గ్లామర్ కంటే కూడా పొలిటికల్ గ్రామర్ ని నమ్ముకున్న‌ట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఏ సాయాన్ని కోరి కాదనుకోరు.కానీ కొన్ని పార్టీకి ఇబ్బంది కలిగిస్తాయనుకున్న వాటి విషయంలో మాత్రం మౌనంగా రాజకీయం చేస్తారు అంటున్నారు.

తాజా వార్తలు