మొటిమలను మాయం చేసి ముఖాన్ని బ్రైట్ గా మార్చే మ్యాజికల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ముఖ సౌందర్యాన్ని పాడు చేసే చర్మ సమస్యల్లో( Skin Problems ) మొటిమలు ముందు వరుసలో ఉంటాయి.

మొటిమలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా అవి మాత్రం మనల్ని ఎప్పటికప్పుడు వేధిస్తూనే ఉంటాయి.

మనశ్శాంతిని దూరం చేస్తాయి.అయితే కొందరికి మొటిమలు చాలా అధికంగా ఉంటాయి.

ముఖం పై ఎక్కడ చూసినా మొటిమలే కనిపిస్తాయి.ఇలాంటి వారు చాలా వేదనకు గురవుతుంటారు.

మొటిమ‌ల‌ను వ‌దిలించుకోవ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

This Is A Magical Remedy That Removes Acne And Makes The Face Bright, Magical R
Advertisement
This Is A Magical Remedy That Removes Acne And Makes The Face Bright!, Magical R

అయితే అసలు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే మొటిమలు( Pimples ) మాయం అవ్వడమే కాదు మీ ముఖం బ్రైట్ గా కూడా మారుతుంది.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరటిపండు ముక్కలు వేసుకోవాలి.అలాగే పది ఫ్రెష్ పుదీనా ఆకులు, రెండు రెబ్బలు లేత వేపాకు, పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ), వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.

చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ ను ఐస్ ట్రేలో నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.

నాలుగు లేదా ఐదు గంటల అనంతరం తయారైన ఐస్ క్యూబ్స్ ను తీసుకుని ముఖంపై సున్నితంగా రబ్ చేసుకోవాలి.రోజుకు రెండు ఐస్ క్యూబ్స్ చొప్పున తీసుకుని ముఖానికి రుద్దాలి.

This Is A Magical Remedy That Removes Acne And Makes The Face Bright, Magical R
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఇలా ప్రతిరోజు కనుక చేస్తే ముఖంపై ఎంతటి మొండి మొటిమలు ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.వాటి తాలూకు మచ్చలు సైతం తగ్గుముఖం పడతాయి.క్లియ‌ర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Advertisement

అదే సమయంలో మీ ముఖ చర్మం బ్రైట్ గా మారుతుంది.షైనీ గా మెరుస్తుంది.

కాబట్టి మొటిమలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్‌ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు