పవన్ కు ఇదే మంచి ఛాన్స్.. మిస్ అయితే కష్టమే !

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే.ఎన్నికల ముందు ప్రధాన పార్టీలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Naidu arrest ) కావడం, టీడీపీ స్లో అవ్వడం, ఇదే టైమ్ లో జనసేన టీడీపీతో పొత్తు ప్రకటించడం, మరోవైపు అధికార వైసీపీ దూకుడు ప్రదర్శించడం.ఇలా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్నా అనూహ్య పరిణామాలు అన్నీ ఇన్ని కావు.

కాగా ప్రస్తుత పరినమలన్నీ జనసేనకు అనుకూలంగా మరబోతున్నాయా ? అంటే అవుననే అభిప్రాయాలను కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితులను కరెక్ట్ గా పవన్ వదుకుంటే తన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో సి‌ఎం పదవే తన లక్ష్యం అని పవన్( Pawan kalyan ) ఇప్పటికే చాలా సార్లు తన మనసులోని మాటను బయట పెట్టారు.తాను ఏ పార్టీతో కలిసిన తన లక్ష్యం మాత్రం అదేనని గతంలోనే చెప్పుకొచ్చారు.అయితే సి‌ఎం అభ్యర్థి విషయంలో బీజేపీ( BJP) నుంచి పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేకపోయిన టీడీపీ విషయంలో మాత్రం చంద్రబాబు ద్వారా పోటీ ఉండేది.

Advertisement

కానీ అనూహ్య పరిణామాల దృష్ట్యా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు జైలు పాలు అయ్యారు.అసలు బయటకు వస్తారో లేదో కూడా చేపలేని పరిస్థితి.ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ సి‌ఎం అభ్యర్థిగా తానే ఉండాలనే డిమాండ్ ను టీడీపీ ముందుంచితే టీడీపీ కూడా తప్పక ఒప్పుకునే పరిస్థితులు ఉన్నాయి.

ఎందుకంటే చంద్రబాబు తరువాత టీడీపీ తరుపున సి‌ఎం అభ్యర్థిగా లోకేశ్( Nara lokesh ) ను సొంత పార్టీ నేతలే తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో రెండు పార్టీల ఉమ్మడి సి‌ఎం అభ్యర్థిగా పవన్ కు మంచి ఛాన్స్ ఉంది.అటు వైసీపీ ప్రభుత్వం పై కూడా ప్రజల్లో వ్యతిరేకత గట్టిగానే ఉంది.

జగన్ ను ఢీ కొట్టి నిలిచే సమర్థత పవన్ కు ఉందని వైసీపీ నేతలే పలు మార్లు నిరూపిస్తున్నారు.దీంతో ప్రస్తుత పరిణామాలను పవన్ చతురత ప్రదర్శించి తనకు అనుకూలంగా మలుచుకుంటే తిరుగుండదని, లేదంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ పవన్ కు వచ్చే ఛాన్స్ లేదని కొందరు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

మరి పవన్ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు