వచ్చే ఎన్నికలు దొరలకు- ప్రజలకు మధ్య పోటీ అని కాంగ్రెస్( Congress ) అగ్రనేత రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని ఢిల్లీ దొరలకు గల్లీ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటం జరగబోతుంది అంటూ కేసీఆర్ తనయుడు మరియు బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Working President KTR ) వ్యాఖ్యానించారు.కామారెడ్డిలో( Kamareddy ) జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ, కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని చాలామంది నన్ను అడుగుతున్నారని ఇక్కడి రైతులు కలలు నెరవేర్చేందుకే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని, కేసీఆర్ నామినేషన్ రోజు వచ్చే ప్రజాస్పందనను చూసి ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసేందుకే భయపడే వాతావరణ కల్పించాలని ఆయన ప్రజలను కోరారు.
భాజపా ఇచ్చే చాక్లెట్లను చూసి మోసపోవద్దని, డబ్బులు ఏ పార్టీ ఇచ్చినా తీసుకోవాలని ఓటు మాత్రం బారాసా కే వేయాలని ఆయన ప్రజలను కోరారు.
ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ గత యాబై సంవత్సరాలు గా దొరికిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుందని, ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వాలని తాము అధికారం లో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్స్ నేతలకు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు? సోనియాను బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఇప్పుడు ఆమెను దేవత అని పొగుడుతున్నారని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుందని అయితే మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గి పది సంవత్సరాలు కాలయాపన చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అని తెలంగాణలోని సకల జనులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేసి కొట్లాడితే వెనక్కి తగ్గలేని తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసింది తప్ప అందులో కాంగ్రెస్ గొప్ప ఏమి లేదని , దేశంలోని పార్టీలన్నిటినీ ఒప్పించి తెలంగాణ ఏర్పాటుకు రాజకీయ వాతావరణాన్ని అనుకూలంగా మార్చిన ఘనత కేసీఆర్ దే నాని ఆయన చెప్పుకోచ్చారు .ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్తాయిలో ఉన్నదంటూ అబద్దపు సర్వే లతో కాంగ్రెస్ ప్రజల్ని తప్పు దారి పట్టించాలని చూస్తుందని , తెలంగాణ ప్రజల అభివృద్ది పై ఎవరికి చిత్తశుద్ది ఉందో ప్రజలకు బాగా తెలుసని ఆయన వాఖ్యనించారు .