ఈ పిల్లి చాలా బ్రిలియంట్.. కుక్క నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..!

పిల్లి, కుక్కలను పెంచుకునే వారు చాలామంది ఉంటారు.అయితే వీరి ఇంట ఈ రెండు జంతువుల వల్ల చాలా సందడి నెలకొంటుంది.

ఎందుకంటే ఈ రెండూ ఒకదానికి ఒకటి సరదాగా పోట్లాడుకుంటూ సందడి నెలకొల్పుతాయి.అయితే కుక్కలతో పోల్చుకుంటే పిల్లులు కాస్తా స్మార్ట్‌గా ప్రవర్తిస్తాయి.

This Cat Is So Brilliant See How He Escaped From The Dog , Cat, Viral Latest, N

ఇవి తమ తోటి నివసించే కుక్కలతో ఒక ఆట ఆడుకుంటున్నాయి.అయితే పరిగెత్తిచ్చి మరీ పిల్లులకు కుక్కలు కూడా చెమటలు పట్టిస్తుంటాయి.

అయితే చాలా సందర్భాల్లో కుక్కలకి దొరకకుండా పిల్లులు భలే తెలివిగా తప్పించుకుంటాయి.ఇవి ఎక్కువగా చెట్లు ఎక్కుతాయి లేదా కుక్కలు ఎక్కలేని ప్రాంతాల్లోకి వెళ్లిపోతాయి.

Advertisement

అయితే తాజాగా ఒక పిల్లి మాత్రం చాలా బ్రిలియంట్‌గా ఎస్కేప్‌ అయి అబ్బుర పరిచింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక తెల్ల కుక్క పిల్లిని తరుముతుండటం చూడొచ్చు.పిల్లికి ఎదురుగా స్విమ్మింగ్ పూల్‌లో ఉండటంతో అది ఇరుక్కుపోయిందని కుక్క తెగ సంబరపడిపోయింది.

కానీ ఆ పిల్లి తెలివిగా ఆలోచించి నీటిలోకి దూకలేదు.అందుకు బదులుగా అది స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఒక తెడ్డుపైకి తాపీగా దూకేసింది.అనంతరం స్విమ్మింగ్ పూల్‌ను ఈజీగా దాటేసింది.

దీంతో కుక్క అటువైపు ఉండిపోయింది.పిల్లి మాత్రం సేఫ్ గా ఎస్కేప్ అయి కుక్కకు ఊహించని ఝలక్ ఇచ్చింది.

ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?

చివరికి కుక్క ఓడిపోయి బిక్క మొహం వేసింది.ఈ వీడియోని యజమానులు తమ కెమెరాలో బంధించారు.

Advertisement

అయితే ఇదే వీడియోని ఒక ట్విట్టర్ పేజీ షేర్ చేయగా ఇప్పుడు అది వైరల్ గా మారింది.దీనికి ఇప్పటికే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.45 వేలకు పైగా లైకులు వచ్చాయి.ఈ వీడియోని చూసి నెటిజన్లు వావ్, వాట్ ఏ బ్రిలియంట్ క్యాట్ అని కామెంట్లు పెడుతున్నారు.

దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

తాజా వార్తలు