ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చేరికలు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.వైసిపి లో అసంతృప్తులు ఎక్కువ అవుతుండడం, ఆ పార్టీ నుంచి టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండడం వంటివి రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశాలే అయినా.
ప్రస్తుతం టిడిపిలో చేరాలనుకుంటున్న వారంతా వైసిపి ఎమ్మెల్యేలుగా ఉన్నవారు , రాబోయే ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆశిస్తున్నావారే కావడంతో వారిని చేర్చుకునే విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారట.ప్రస్తుతం వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చేందుకు చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారు.
అయితే వారి రాకను నియోజకవర్గం లోని టిడిపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

వారిని చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుందనే విషయం వారికి తెలిసినా.రాబోయే ఎన్నికల్లో టికెట్ విషయంలో వారు తమకు పోటీ అవుతారని, వారికి టిక్కెట్ హామీ ఇచ్చి పార్టీలో చంద్రబాబు చేర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన టిడిపి నాయకుల్లో కలుగుతోందట.చంద్రబాబు వారిని చేర్చుకుంటే ఇప్పటివరకు పార్టీ కోసం పని చేసిన వారు తీవ్ర అసంతృప్తికి గురై రెబల్ గా మారుతారని , అప్పుడు జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని బాబు అంచనా వేస్తున్నారట.
కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి తరఫున టికెట్ ఆశిస్తున్న వారి కంటే, వైసీపీ నుంచి వచ్చి చేరే వారికే ప్రజాబలం ఎక్కువగా ఉండడంతో, వారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం బాబులు కలుగుతుంది.

కానీ పార్టీ నాయకులు వారికి సహకరించకపోగా వారిని ఓడించేందుకు ప్రయత్నిస్తే.ఆ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది అని బాబు నమ్ముతున్నారట.ప్రస్తుతం నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి తో పాటు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ వైసిపి ఎమ్మెల్యేలతో పాటు, తూర్పుగోదావరి నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారట.
అయితే వీరిని చేర్చుకునే విషయంలో బాబు ఎటూ తేల్చుకోలేక.వారికి టికెట్ హామీ ఇవ్వలేక సతమతమవుతున్నారట.