అజిత్ తో సినిమా ఆగిపోవడానికి వాళ్లే కారణం... డైరెక్టర్ విగ్నేష్ షాకింగ్ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith) ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

ఇలాంటి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే అజిత్ తన తదుపరిచిత్రాన్ని నయనతార(Nayanatara) భర్త దర్శకుడు విగ్నేష్ శివన్(Vignesh Shivan) దర్శకత్వంలో రాబోతుంది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే కొంతకాలం తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ విగ్నేష్ తప్పుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే విగ్నేశ్ సైతం తన ట్విట్టర్లో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను తొలగించడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.అయితే ఈ విధంగా తన సినిమా నుంచి విగ్నేష్ ను తప్పించారంటూ పెద్ద ఎత్తున హీరో పై ఆరోపణలు చేశారు.అలాగే ఈ విషయంలో అజిత్ నయనతార మధ్య కూడా మనస్పర్ధలు చోటుచేసుకున్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ విషయం గురించి డైరెక్టర్ విగ్నేష్ శివన్ స్పందిస్తూ పలు విషయాలను తెలియజేశారు.

Advertisement

ఈ సందర్భంగా విగ్నేష్ మాట్లాడుతూ సినిమా నుంచి తనని తొలగించే విషయంలో హీరో తప్పు ఏమీలేదని తెలిపారు.ఆయనకు నేను రాసిన స్క్రిప్ట్ హీరో అజిత్ కి ఎంతో అద్భుతంగా నచ్చింది.అయితే ఆ కథలో సెకండ్ హాఫ్ నిర్మాతలకు నచ్చకపోవటం వల్లే వారు ఆ సినిమాని వద్దనుకున్నారని,ఈ విషయంలో హీరో అజిత్ తప్పు ఏమాత్రం లేదని ఆయన తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారని ఈ సందర్భంగా విఘ్నేష్ క్లారిటీ ఇచ్చారు.

విగ్నేష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో మగిజ్ తిరుమేనికి అవకాశం ఇచ్చారు.ఇలా తనకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని విగ్నేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు