ఈ కూరగాయల‌ను వండాక తినడం కంటే పచ్చిగా తినడమే మేలు.. తెలుసా?

హెల్తీ గా, ఫిట్ గా ఉండాలి అంటే కచ్చితంగా డైట్ లో కూరగాయలను చేర్చుకోవాల్సిందే.

నిత్యం రెండు రకాల కూరగాయలు తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

శరీరంలో అంతర్గత విధులు నిర్వహించడానికి, రోగ నిరోధక వ్యవస్థను బలపరచడానికి, దీర్ఘకాలిక వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేయడానికి కూరగాయలు ఎంతో గ్రేట్ గా సహాయపడతాయి.అందుకే అన్ని కూరగాయల‌ను డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.

అయితే కొన్ని కూరగాయల‌ను వండాక తినడం కంటే పచ్చిగా తినడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది.అటువంటి కూర‌గాయల్లో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటో.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో ఒకటి.టమాటోతో రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు.

Advertisement

చారు, పులుసు, బిర్యానీ ఇలా అనేక వంటల్లో టమాటోను వినియోగిస్తుంటారు.అయితే టమాటోను వండుకుని తినడం కంటే పచ్చిగా తినడం ఆరోగ్యానికి మంచిది.

టమాటోను ఉడికించడం వల్ల అందులో ఉండే పోష‌కాలు అన్నీ నశిస్తాయి.అదే పచ్చిగా తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

కంటి చూపు రెట్టింపు అవుతుంది.చర్మం యవ్వనంగా మారుతుంది.

యూరిన‌రీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దూరం అవుతాయి.స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించగల సత్తా కూడా టమాటోకు ఉంది.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

అలాగే బ్రోకలీని కూడా వీలైనంతవరకు వండకుండా తినాలి.ముఖ్యంగా సలాడ్ రూపంలో బ్రోకలీ తీసుకోవడం వల్ల అధిక మేలు జరుగుతుంది.బ్రోకలీ లో ఉండే పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.

Advertisement

ఇక బీట్ రూట్ ను కూడా పచ్చిగా తీసుకునేందుకే ప్రయత్నించాలి.బీట్ రూట్ లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

ఉడికిస్తే సగానికి పైగా పోషకాలు పోతాయి.

అదే పచ్చి బీట్ రూట్ తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి చాలా వేగంగా బయటపడతారు.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.లివర్ ఆరోగ్యంగా శుభ్రంగా మారుతుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

కాబట్టి బీట్ రూట్ కూడా వండకుండా తినేందుకే ప్రయత్నించండి.