ఈ ముగ్గురి బాలీవుడ్ ఆశలు గల్లంతే.. పాపం అంతా రివర్స్ అయిందిగా..

టాలీవుడ్ లో నటనతో మంచి పేరు తెచ్చుకున్న వారు బాలీవుడ్ కు కూడా వెళ్లి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశ పడుతూ ఉంటారు.

అయితే అందరికి బాలీవుడ్ అచ్చి రాదు.

ఇక్కడ టాలీవుడ్ లో ఎంత పేరు తెచ్చుకున్న బాలీవుడ్ కు వెళ్తే మాత్రం అక్కడ అస్సలు గుర్తింపు కూడా లభించదు.అందుకు మన సినిమా సెలెక్షన్స్ విషయంలో కూడా తప్పు ఉంటుంది.

సరైన సినిమా ద్వారా ఏ ఇండస్ట్రీకి వెళ్లిన పేరు వస్తుంది కానీ.సినిమా కథనే బెడిసి కొడితే అది ఏ ఇండస్ట్రీ అయినా ఫలితం సూన్యమే.

ఇదే విషయం ఈ ముగ్గురు స్టార్స్ విషయంలో నిజం అయ్యింది.ఈ ముగ్గురు స్టార్స్ కూడా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement

అయితే బాలీవుడ్ లో మాత్రం పేరు తెచ్చుకోలేక మొదటి సినిమాతోనే ఎలా వెళ్లారో అలానే రివర్స్ అయ్యి వచ్చేస్తున్నారు.

మరి ఆ ముగ్గురు స్టార్స్ ఎవరంటే.ముందుగా అక్కినేని నాగ చైతన్య గురించి చెప్పుకోవాలి.ఇతడు నాగ్ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ఇక ఇతడు లాల్ సింగ్ చడ్డా తో ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.కానీ మొదటి సినిమానే ప్లాప్ అయ్యింది.దీంతో ఇతడు బాలీవుడ్ ఆశ తీరలేదు.

ఇక మరో స్టార్ ఎవరంటే.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

ఎన్నో అంచనాలతో లైగర్ సినిమా చేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

కానీ ఎంత హైప్ వచ్చిందో ఈ సినిమా అంత డిజాస్టర్ అయ్యింది.దీంతో ఇతడు బాలీవుడ్ ఆశలు నెరవేరలేదు.ఇక ఇప్పుడు మరో స్టార్ తొలి ప్రయత్నంలోనే విఫలం అయ్యాడు.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రామ్ సేతు సినిమాలో మన టాలీవుడ్ స్టార్ సత్యదేవ్ బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.కానీ ఈయన ప్రయత్నం కూడా ఫలించలేదు.

ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుని సత్యదేవ్ కు షాక్ ఇచ్చింది.ఇలా ఈ ముగ్గురు స్టార్స్ కూడా బాలీవుడ్ ఆశలు నెరవేరలేదు.