పోలీసు చెంపదెబ్బ కొట్టాడని డెలివరీ బాయ్ ఆగ్రహం.. చివరికి ఏం చేశాడంటే

ఏదైనా గొడవ జరిగిందంటే అంతా న్యాయం కోసం పోలీసుల వద్దకు వెళ్తుంటారు.అయితే వివాదం పరిష్కరించాల్సిన పోలీసులు దుందుడుకుగా వ్యవహరిస్తుంటారు.

 Food Delivery Boy Set His Bike On Fire In Front Of A Police Station In Delhi Vid-TeluguStop.com

కొన్ని సార్లు నిజానిజాలు విచారించకుండా వెంటనే తీర్పు చెప్పేస్తారు.అసలు బాధితులు ఎవరో, బాధించింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయరు.

పోలీసులలో కొంత మంది సావధానంగా సమస్య విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంటారు.అయితే చాలా మంది పోలీసులు సమస్యను పెద్దది చేస్తుంటారు.

తాజాగా ఇలాంటి ఘటన ఢిల్లీలో జరిగింది.తనను పోలీసు చెంపదెబ్బ కొట్టాడని ఓ యువకుడు ఆగ్రహంతో వారికి చుక్కలు చూపించాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది.

ఇక శనివారం అక్కడి ఓ రెస్టారెంట్‌కు యువతి తన ఫ్రెండ్‌తో కలిసి వచ్చింది.తినడానికి ఏదో ఆహార పదార్థం ఆర్డర్ ఇచ్చింది.

అదే సమయంలో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ నదీమ్ (23) అక్కడికి వచ్చాడు.అనుకోకుండా ఆ యువతిని చూశాడు.

నదీమ్ తనను తదేకంగా చూస్తున్నాడని ఆ యువతి చూసింది.దీంతో తనను ఎందుకు అలా చూస్తున్నావని ప్రశ్నించింది.

ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద వివాదంగా మారింది.ఇక నదీమ్ పై ఆ యువతి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.

అయితే ఈ చిన్న విషయానికి కేసు వరకు ఎందుకు అని, తాము చూసుకుంటామని పోలీసులు ఆమెకు సర్ది చెప్పి పంపేశారు.

ఇక నదీమ్ వ్యవహారం బాగోలేదని, అతడే గొడవకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.దీంతో నదీమ్ ను ఓ పోలీస్ చెంప దెబ్బ కొట్టాడు.ఈ వివాదంలో తన తప్పు లేకపోయినా అందరి ముందు తనను కొట్టారని నదీమ్ కోపం పెంచుకున్నాడు.

తర్వాతి రోజు ఆదివారం తన బైక్‌ను పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేశాడు.ఆపై పెట్రోల్ ను బైక్‌పై పోసి, నిప్పంటించేశాడు.మంటలు పెద్ద పెద్దగా వస్తుండడంతో పోలీసులు ఆర్పేందుకు ముందుకు వచ్చారు.అయితే పోలీసులపై నదీమ్ రాళ్లు విసిరాడు.

అతడిని అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదు.చివరికి అతడిని చాలా కష్టం మీద అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube