మహాశివరాత్రి రోజు ఈ పనులను అస్సలు చేయకూడదు..

మహా శివరాత్రి రోజు పరమశివుడి భక్తులు మహాశివుని నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.సుఖ సంతోషాలు వస్తాయని భక్తుల గట్టి నమ్మకం.

శివరాత్రి రోజున శివుడి భక్తులంతా ఉపవాసం పాటిస్తారు.రాత్రంతా జాగారం చేస్తారు.

ఈ రోజున అర్ధరాత్రి శివుడికి పూజలు కూడా చేస్తూ ఉంటారు.మరి ఈ పండుగ సందర్భంగా శివరాత్రి రోజున ఏ పనులు చేయాలి.

ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

These Things Should Not Be Done At All On The Day Of Mahashivratri, Mahashivratr
Advertisement
These Things Should Not Be Done At All On The Day Of Mahashivratri, Mahashivratr

మహాశివరాత్రి రోజు ఈ పనులను అస్సలు చేయకూడదు.గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి అసలు తినకూడదు.

పొగాకు, మధ్యాన్ని అస్సలు సేవించకూడదు.అలా చేయడం మహా పాపం.

శివలింగానికి కొబ్బరి నీరు సమర్పించకూడదు.

These Things Should Not Be Done At All On The Day Of Mahashivratri, Mahashivratr

కేతకి పువ్వులకు దూరంగా ఉండడం మంచిది.పూజ కోసం స్టీల్ వస్తువులను అసలు ఉపయోగించకూడదు.నలుపు రంగు బట్టలు ధరించడం మంచిది కాదు.

గ్రీన్ టీ లో ఈ ఆకును కలిపి తీసుకుంటే డబుల్ హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి!

వీలైతే ఆ రోజు నలుపు రంగు కు కాస్త దూరంగా ఉండడమే మంచిది.తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు.

Advertisement

శివరాత్రి రోజు చేయవలసిన పనులు ఇవే.మహా శివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి.అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందు నిద్రలేయడం లేవడం మంచిది.

ఆ తర్వాత ధ్యానం చేయాలి.ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత తల స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులను ధరించడం మంచిది.

వీలైతే ఆ రోజు తెల్ల రంగు దుస్తులను ధరించాలి.ఆ రోజు ఉపవాసం పాటించేవారు, ఉపవాసానికి ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి వైద్యుని సంప్రదించడం మంచిది.ఎందుకంటే రెగ్యులర్ డైట్ ప్లాన్ మార్చుకోవడం వల్ల మీ ఆరోగ్యం పై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.

శివుని భక్తులు శివరాత్రి రోజు అర్ధరాత్రి పూజలు చేస్తూ ఉంటారు.

తాజా వార్తలు