High blood pressure : అధిక ర‌క్త‌పోటు వేధిస్తుందా? అయితే ఈ గింజ‌లు మీ డైట్ లో ఉండాల్సిందే!

అధిక రక్తపోటు.స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.

అధిక రక్తపోటు అనేది చిన్న సమస్యగానే కనిపించిన దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె, మూత్రపిండాలు, మెదడు తదితర అవయవాలు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి.అలాగే అధిక రక్తపోటు వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడం, చిరాకు, ఒత్తిడి, చూపు మసక బారడం, తీవ్రమైన తలనొప్పి తదితర లక్షణాలన్నీ తలెత్తుతుంటాయి.

అందుకే రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు అవిసె గింజ‌లు అద్భుతంగా సహాయపడతాయి.

తక్కువ ధరకే లభించే అవిసె గింజ‌ల్లో బోలెడ‌న్ని పోషక విలువలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Advertisement

ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు రోజుకు ఒక స్పూన్ అవిసె గింజలు తీసుకోవాలి.

తద్వారా రక్తపోటు స్థాయిలో అదుపులోకి వస్తాయి.అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అవిసె గింజలు వేసి లైట్ గా డ్రై రోస్ట్ చేసుకోవాలి.

ఇలా వేయించిన అవిసె గింజలను పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ జార్ లో మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ప్రతి రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున‌ కలిపి సేవించాలి.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

అలాగే ఈ పొడిని సలాడ్స్ లో కలిపి కూడా తీసుకోవచ్చు.ఇలా ఏదో ఒక విధంగా రోజు అవిసె గించాలని తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.అంతేకాదు వెయిట్ లాస్ అవుతారు.

Advertisement

పలు రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ఎముకలు దృఢంగా మారుతాయి.

మలబద్ధకం సమస్య సైతం పరార్ అవుతుంది.