మ‌ల‌బ‌ద్ధ‌కం త‌ర‌చూ ఇబ్బంది పెడుతుందా.. అయితే మీ డైట్ లో ఈ పండ్లు ఉండాల్సిందే!

మలబద్ధకం( Constipation ) .వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం, ఫైబర్ కొరత, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తూ ఉంటుంది.సమస్త రోగాలకు మలబద్ధకం అనేది మొదటి మెట్టు.

అందుకే మలబద్ధకం సమస్యను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.అయితే కొన్ని రకాల పండ్లు మలబద్ధకం సమస్యకు చెక్‌ పెట్టడానికి చాలా అద్భుతంగా సహాయపడతాయి.

అటువంటి పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అర‌టిపండు( Banana ) మ‌ల‌బ‌ద్ధ‌కానికి అతి పెద్ద శ‌త్రువు.

Advertisement

ఏడాది పొడ‌వునా ల‌భించే అర‌టిపండులో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డేవారు రోజుకు ఒక అర‌టి పండును తీసుకుంటే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను( Digestive problems ) నివారించ‌డంతో బొప్పాయి పండు కూడా చాలా అద్భుతంగా తోడ్ప‌డుతుంది.ఒక క‌ప్పు బొప్పాయి పండు ( Papaya fruit ) ముక్క‌లు తింటే మ‌ల‌బ‌ద్ధ‌కం ప‌రార్ అవుతుంది.

క‌డుపు శుభ్రంగా మారుతుంది.

స‌మ్మ‌ర్ సీజ‌న్ లో విరివిరిగా ల‌భ్య‌మ‌య్యే పియ‌ర్ ఫ్రూట్ కూడా మ‌ల‌బ‌ద్ధ‌కం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు హెల్ప్ చేస్తుంది. పియ‌ర్ ఫ్రూట్( Pear fruit ) పేగుల్లో జీర్ణ రసాలను పెంచుతుంది.అదే స‌మ‌యంలో పేగుల్లో కూరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది.

భారత్‌లోని ఆ ప్రాంతంలో తిరుగుతూ కెమెరాకి చిక్కిన యూఎఫ్ఓ?
దండం పెడతాను నన్ను వదిలేయండి...పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన రేణు దేశాయ్!

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను న‌యం చేస్తుంది.అలాగే యాపిల్‌, ప‌చ్చ‌కాయ, ద్రాక్ష‌ వంటి పండ్లు కూడా మల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను నివారించ‌డానికి.

Advertisement

జీర్ణ‌క్రియ ఆరోగ్యాన్ని ప్రోత్స‌హించ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి.

ఇక ఈ పండ్లు తీసుకోవ‌డంతో పాటు శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించండి.రోజుకు ఎనిమిది నుంచి ప‌ది గ్లాసుల వ‌ర‌కు వాట‌ర్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోండి.కెఫిన్ సోడాలు, కాఫీ మరియు ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి.

పైన చెప్పిన పండ్ల‌తో పాటు కూరగాయలు, తృణధాన్యాలను డైట్ లో చేర్చుకోండి.నిత్యం క‌నీసం అర‌గంట వ్యాయామం చేయండి.

వాకింగ్‌, ర‌న్నింగ్ ఇలా ఏదో ఒక వ్యాయామం చేయ‌డం దిన‌చ‌ర్య‌లో భాగం చేసుకోండి.త‌ద్వారా మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య వెన‌క్కి తిరిగి చూడ‌కుండా పారిపోతుంది.

తాజా వార్తలు