రక్తహీనత నుంచి తొందరగా బయటపడాలనుకుంటే ఈ ఆహారాలను తప్పక తీసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మంది రక్తహీనతకు( Anemia ) బాధితులుగా ఉన్నారు.

రక్తహీనత అనేది రక్తంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ సంఖ్య తగ్గినప్పుడు సంభవించే పరిస్థితి.

ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు మహిళల్లో రక్తహీనత అనేది ఎక్కువగా ఏర్పడుతుంది.పొరపాటున రక్తహీనతను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు గా మారుతుంది.

రక్తహీనతను తగ్గించడానికి, మీరు ఇనుము అధికంగా ఉండే ఆహారాలు మరియు మీ శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడే ఆహారాలను తీసుకోవాలి.కాబ‌ట్టి అటువంటి ఆహ‌రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తహీనత నుంచి తొందరగా బయటపడాలనుకుంటే ముదురు ఆకుపచ్చ ఆకు కూరలను( Green Leafy Vegetables ) తప్పక తీసుకోండి.ముఖ్యంగా పాల‌కూర‌, తోట‌కూర‌, గోంగూర వంటి ఆకుకూర‌ల‌ను ఎక్కువ‌గా తినండి.

Advertisement

ఇవి శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇనుమును( Iron ) అందిస్తాయి.ర‌క్త‌హీన‌త‌ను త‌రిమికొడ‌తాయి.

అలాగే ర‌క్త‌హీన‌త ఉన్న‌వారికి క‌రివేపాకు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంది.గుప్పెడు క‌రివేపాకుల‌ను దంచి మ‌జ్జిగ‌లో క‌లిపి తీసుకోవాలి.

క‌రివేపాకులో( Curry Leaves ) ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల శరీరం ఇనుమును గ్రహించడంలో ఉత్తంగా సహాయపడుతుంది.

రక్తహీనత ఉన్నవారు నిత్యం ఒక దానిమ్మ పండును( Pomegranate ) తినాలి.ఐర‌న్ తో పాటు దానిమ్మలో విటమిన్ సి, విట‌మిన్ ఎ మ‌రియు విల‌మిన్ ఇ పుష్క‌లంగా ఉంటాయి.ఇవి ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడానికి, శరీరంలో ఐరన్ కంటెంట్‌ను మెరుగుపర‌చ‌డానికి తోడ్ప‌డ‌తాయి.

పొలోమని సినిమాలు చేసుకుంటూ వెళ్తారు కానీ ఒక్క హిట్టూ కొట్టలేరు.. ఎవరంటే..?
వింటర్ లో పెదాల పగుళ్లకు దూరంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!

అలాగే ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం బీట్‌రూట్‌, క్యారెట్ మ‌రియు ఉసిరితో జ్యూస్ త‌యారు చేసుకుని రోజుకు ఒక గ్లాసు చొప్పున తీసుకోవాలి.ఈ జ్యూస్ తో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

Advertisement

ఎండుద్రాక్ష, ప్రూనే, ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్, న‌ట్స్ మ‌రియు సీడ్స్‌ ఇనుము యొక్క మంచి వనరులు.స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్స్ మరియు టొమాటోలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా ఇనుము యొక్క శోషణను మెరుగుపరచవచ్చు.అయితే ఐరన్-రిచ్ ఫుడ్స్ ను తీసుకునే టైమ్ లో క్యాల్షియం-రిచ్ ఫుడ్స్ తినడం త‌గ్గించాలి.

ఎందుకంటే కాల్షియం ఇనుము యొక్క శోషణను తగ్గిస్తుంది.

తాజా వార్తలు