ఇతరుల కారణంగా పేర్లు మార్చుకున్న సినిమా సెలబ్రిటీస్.. ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు.అయితే కొత్తగా వచ్చే వారి పేర్లు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్ల పేర్లు ఒకటైతే ఇబ్బంది.

ఉదాహరణకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, ఐశ్వర్య లాంటి హీరోహీరోయిన్లు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ బాగా పేరు తెచ్చుకున్నారు.ఇవే పేర్లు ఉన్న వేరే వాళ్ళు ఇండస్ట్రీలోకి రావాలంటే ముందుగా తమ పేర్లను మార్చుకోవాలి.

లేకపోతే పెద్ద కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది.కొంతమంది టాప్ సెలబ్రిటీలు ఇతరుల కారణంగా ఇలాగే పేర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

వాళ్లు ఎవరో తెలుసుకుందాం పదండి.

యాక్టర్ శ్రీరామ్

Advertisement

యాక్టర్ శ్రీరామ్( Actor Sriram ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.2012లో వచ్చిన తమిళ మూవీ నన్బన్‌లో విజయ్ స్నేహితుడిగా ఇతడు నటించాడు.ఈ సినిమా తెలుగులో స్నేహితుడుగా రిలీజ్ అయింది.

వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కూడా యాక్ట్ చేశాడు.ఇందులో హీరోకు ఫ్రెండ్ గా, హీరోయిన్ కు బావగా కనిపించాడు.

ఇంకా చాలా చెప్పుకోదగిన సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించాడు.నిజానికి శ్రీరామ్ తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తుంటాడు.

ఈ నటుడి అసలు పేరు శ్రీకాంత్.అయితే తెలుగులో శ్రీకాంత్ అనే స్టార్ హీరో ఉన్నారు.

రెండోసారి తల్లి కాబోతున్న ప్రముఖ నటి ప్రణీత.. ఈ దుస్తులు ఇక సరిపోవంటూ?
భానుప్రియ నల్లగా ఉందని 2 నెలలు పసుపు రాయించారు.. ఏ సినిమా కోసమంటే...?

కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని ఆయన తన పేరును శ్రీరామ్ గా మార్చుకున్నారు.

హంసా నందిని

Advertisement

ఈ నటి అసలు పేరు పూనమ్.అయితే తెలుగు సినిమాల్లో పూనమ్‌ పేరుతో ఇద్దరు నటీమణులు ఉన్నారు కాబట్టి తన పేరును హంసా నందినిగా మార్చుకుంది.మోడల్, డాన్సర్‌గానూ ఈ అందాల తార పనిచేస్తుంది.

ఈ పంచదార బొమ్మ 2015లో రుద్రమదేవి సినిమాలో యువరాణి మదనికగా నటించింది.ఈ అందాల తార ఎక్కువగా ఐటెమ్ సాంగ్స్‌లో కనిపిస్తుంది.

అహ నా పెళ్ళంట, ఈగ వంటి సినిమాల్లో కూడా యాడ్ చేసింది.

కియారా అద్వానీ

ఈ స్టార్ హీరోయిన్ పేరు అలియా అద్వానీ.

అయితే అప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో అలియా భట్( Alia Bhatt ) స్టార్ హీరోయిన్ అయిపోయింది.అందుకే ఈ హీరోయిన్ తన పేరును కియారా( Kiara Advani )గా మార్చుకుంది.

లస్ట్ స్టోరీస్ సినిమాలోని లైంగికంగా సంతృప్తి లేని వైఫ్ గా ఈమె నటించి సంచలనం సృష్టించింది.తెలుగులో పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను (2018)లో హీరోయిన్‌గా చేసి ఆకట్టుకుంది.

తాజా వార్తలు