బంగ్లాదేశ్ పై గెలిచిన మ్యాచ్లో భారత జట్టు చేసిన రెండు అతిపెద్ద తప్పులు ఇవే..!

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ ( India-Bangladesh )మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.అదే సమయంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి.

 These Are The Two Biggest Mistakes Made By The Indian Team In The Match They Won-TeluguStop.com

రోహిత్ శర్మ చేసిన మొదటి తప్పు ఏమిటంటే.రవీంద్ర జడేజా తన బౌలింగ్ తో బంగ్లాదేశ్ బ్యాటర్లను ఎలా ఆడుకుంటాడో మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది.

అలాంటి బౌలర్ ను 18వ ఓవర్ వరకు రోహిత్ బరిలోకి దింపలేదు.రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) చేతికి ముందే బంతి వచ్చి ఉంటే బంగ్లాదేశ్ బ్యాటర్లు అంత మంచి భాగస్వామ్యం నెలకొల్పే వారు కాదు.

బంగ్లా ఓపెనర్లను రవీంద్ర జడేజా ఇబ్బంది పెట్టి వారి భాగస్వామ్యాన్ని కచ్చితంగా బ్రేక్ చేసేవాడని నిపుణుల అభిప్రాయం.పవర్ ప్లే అవ్వగానే కుల్దీప్ యాదవ్ కాకుండా రవీంద్ర జడేజా చేతికి బంతి ఇచ్చి ఉంటే బాగుండేది.

Telugu Bangladesh, Indian, Ravindra Jadeja, Rohit Sharma-Sports News క్ర�

రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీ నిర్ణయం ఏమిటంటే.హార్థిక్ పాండ్యా( Harthik Pandya ) గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో మైదానం వీడాడు.రోహిత్ శర్మ మిగిలి ఉన్న బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించుకొని బంగ్లాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.మ్యాచ్లో పాండ్యా లేని లోటు కనిపించకుండా చేశాడు.రోహిత్ శర్మ స్పిన్నర్లను చాలా చక్కగా రొటేట్ చేశాడు.ఈ విషయంలో రోహిత్ శర్మ( Rohit Sharma ) కెప్టెన్సీ సూపర్ అని ఒప్పుకోవచ్చు.

ఈ మ్యాచ్లో భారత జట్టు బ్యాటింగ్ లో టాప్-4 లో కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచగలిగాడు.రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ బాగానే రాణించినప్పటికీ అనవసరమైన భారీ షాట్లు ఆడి అవుట్ అయ్యారు.

వరల్డ్ కప్ టైటిల్ గెలవాలంటే.భారత జట్టు బ్యాటింగ్ టాప్-4 రాణించడం చాలా ముఖ్యం.

ఈ మ్యాచ్లో బంగ్లా జట్టును కేవలం 256 పరుగులకు మాత్రమే కట్టడి చేయడం వల్ల భారత జట్టు ఒత్తిడి లేకుండా ఛేజింగ్ చేసి ఘనవిజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube