ప్రభుత్వం సబ్సిడీని తగ్గించినప్పటికీ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
ఈ స్కూటర్లు కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా హై రేంజ్‌తో అందుబాటులోకి వస్తున్నాయి.
ఇప్పటివరకు రిలీజ్ అయిన స్కూటర్లలో చాలావరకు 100కి.మీకు పైగానే రేంజ్ అందిస్తున్నాయి.
సింగిల్ ఛార్జింగ్‌తో హైయ్యెస్ట్ రేంజ్ కలిగిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను చూద్దాం.• సింపుల్ వన్:సింపుల్ వన్ స్కూటర్‌లో ఫిక్స్‌డ్, రిమూవబుల్( Fixed, removable ) అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి.ఈ బ్యాటరీ ప్యాక్‌ల మొత్తం కెపాసిటీ 5kWh, ఇది స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.దీని ధర రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).
• ఓలా S1 ప్రో Gen 2:ఈ స్కూటర్ మునుపటి వెర్షన్ మాదిరిగానే 4kWh బ్యాటరీ ప్యాక్‌తో 195 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది.దీని ధర రూ.1,47,327 (ఎక్స్-షోరూమ్).• ఓలా S1 ప్రో:భారతదేశంలో బాగా పాపులర్ అయిన ఓలా S1 ప్రో స్కూటర్( Ola S1 Pro Scooter ) చాలా ఫీచర్లతో వస్తుంది.ఇది 4kWh బ్యాటరీ ప్యాక్, 181 కిలోమీటర్ల క్లెయిమ్ రేంజ్ కలిగి ఉంది.
• హీరో విడా V1 ప్రో:హీరో విడా V1 ప్రో స్కూటర్( Hero Vida V1 Pro Scooter ) ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది.ఇది 3.94kWh బ్యాటరీ ప్యాక్, 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.దీని ధర రూ.1.25 లక్షలు. • ఏథర్ 450X Gen 3:ఈ స్కూటర్ బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో బాగా పాపులర్ అయింది.ఇది 3.7kWh బ్యాటరీ ప్యాక్, 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.ఈ స్కూటర్లన్నీ పర్ఫామెన్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండానే ఎక్కువ కి.మీల రేంజ్ అందిస్తున్నాయి.రేంజ్ గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులకు ఇవి మంచి ఎంపిక.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy