Fake Chicken Eggs : మీరు తింటున్నది నకిలీ గుడ్డో.. అసలైన గుడ్డో తెలుసుకోవడానికి గల చిట్కాలు ఇవే..!

ప్రస్తుతం మార్కెట్లో చాలా చోట్ల నకిలీ కోడి గుడ్లు( Fake Chicken Eggs ) అమ్ముతున్నట్లు తెలుస్తూ ఉంది.

ఈ నకిలీ కోడి గుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్ తో నకిలీ గుడ్డు పెంకులు తయారు చేస్తారు.

అలాగే గుడ్డులోని పచ్చ సోనా, గుడ్డులోని తెల్ల సొనను ఆల్జినేట్, అల్యూమ్, జిలాటిన్ తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు,ఫుడ్ కలరింగ్ తో తయారు చేస్తున్నారు.నకిలీ గుడ్డును గుర్తించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే నకిలీ కోడి గుడ్ల పైపెంకు నిజమైన వాటి కంటే మెరుస్తూ ఉంటుంది.అలాగే నకిలీ గుడ్లు నిజమైన గుడ్ల కంటే గట్టిగా ఉంటాయి.

These Are The Tips To Know Whether You Are Eating Fake Chicken Eggs Or Real Chi

ఇంకా చెప్పాలంటే కోడి గుడ్లను షేక్ చేస్తే సెల్ లోపల నీరుల కదలాడుతున్నట్లు ఉంటే అది నకిలీ గుడ్డు అని నిపుణులు చెబుతున్నారు.అలాగే గుడ్డును పగల గొట్టిన వెంటనే గుడ్డులోని పచ్చ సోనా, తెల్ల సోనా కలిసిపోతే అది నకిలీ గుడ్డే అని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే నిజమైన గుడ్లు నీసు వాసనను కలిగి ఉంటాయి.

Advertisement
These Are The Tips To Know Whether You Are Eating Fake Chicken Eggs Or Real Chi

అయితే నకిలీ గుడ్లు వాసన లేనివిగా ఉంటాయి.అలాగే పాన్ లో పగల గొట్టి వేసిన కోడి గుడ్డు మీరు తాకకుండా వ్యాపిస్తే అది నకిలీ గుడ్డు.

అలాగే కోడి గుడ్డు నకిలీ అయితే దాని పై పెంకు కు మంట పెడితే అది కాలుతూ ప్లాస్టిక్ వాసన వస్తుంది.

These Are The Tips To Know Whether You Are Eating Fake Chicken Eggs Or Real Chi

ముఖ్యంగా చెప్పాలంటే నిజమైన కోడి గుడ్డు పై పెంకు త్వరగా కాలదు.అలాగే నకిలీ కోడి గుడ్ల వల్ల మెదడు, నరాల నష్టం, కాలేయ వ్యాధులు, రక్త ఉత్పత్తిని ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు( Health problems ) వస్తాయని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిదనీ నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!
Advertisement

తాజా వార్తలు