భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం అవ్వనుంది.ప్రస్తుతం భారత గడ్డపై వార్మప్ మ్యాచులు జరుగుతున్నాయి.
అక్టోబర్ ఐదు న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది.అక్టోబర్ 8న భారత్( India ) తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా పై ఆడనుంది.
ప్రపంచ కప్ లో భారత జట్టును ఇప్పటివరకు ఓడించలేని జట్లు ఏమిటో చూద్దాం.ఇప్పటివరకు 12 వన్డే వరల్డ్ కప్ లు జరిగాయి.అయితే 9 జట్లపై భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది.ఇంతకీ ఆ జట్లు ఏవంటే.
పాకిస్తాన్,( Pakistan ) నెదర్లాండ్స్,( Netherlands ) ఆఫ్ఘనిస్తాన్, కెన్యా, ఐర్లాండ్, నమీబియా, యూఏఈ, బెర్ముడా, తూర్పు ఆఫ్రికా జట్లు ఇప్పటివరకు ప్రపంచ కప్ లో భారత్ ను ఓడించలేకపోయాయి.
ప్రపంచ కప్ లో భారత్, పాకిస్తాన్ తో ఏడుసార్లు తలపడితే.ఒక్క మ్యాచ్ లో కూడా భారత్ పై పాకిస్తాన్ పైచేయి సాధించలేకపోయింది.అన్నీ మ్యాచ్లలో భారత్ గెలిచింది.
మొదటినుంచి ప్రపంచ కప్ లలో( World Cup ) పాకిస్థాన్ పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది.ఇక మిగతా జట్ల విషయానికి వస్తే.
భారత్- కెన్యా మధ్య 4 ప్రపంచ కప్ మ్యాచ్లు జరిగితే అన్ని మ్యాచ్లలో భారత్ గెలిచింది.
నెదర్లాండ్స్, ఐర్లాండ్ జట్లు రెండుసార్లు భారత్ తో తలపడితే.అన్ని మ్యాచ్లపై భారత్ పై చేయి సాధించింది.ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, తూర్పు ఆఫ్రికా, బెర్ముడా జట్లు ప్రపంచకప్ లో భారత్ పై ఒక్కో మ్యాచ్ లో తలపడ్డాయి.
ఏ జట్టు కూడా భారత్ ను ఓడించలేకపోయింది.ప్రపంచ కప్ లో భారత్ ను ఓడించిన జట్లు ఇవే.న్యూజిలాండ్ ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా.