మే నెల నుంచి అమలుకానున్న కొత్త రూల్స్ ఇవే..!

కొత్త నెల వచ్చిందంటే చాలు సామాన్యుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు గుండెల్లో రైళ్లు పరుగేడతాయి.

ఎందుకంటే నెల ప్రారంభం నుంచి దేశంలోని వివిధ అంశాల్లో పలు మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి.

మరి మే నెల ప్రారంభంలోని కొత్త రూల్స్ గురించి తెలుసుకుందామా.ముందుగా గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే.

ప్రతి నెల సిలిండర్ ధర విషయంలో మార్పులు జరుగుతూనే వస్తాయి.ఎందుకంటే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తారీఖున గ్యాస్ సిలిండర్ ధరలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి.

అంటే మే 1వ తేదీన కొత్త గ్యాస్ ధరలను నిర్ణయిస్తారు.ఇక మే నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు పని చేయవు.

Advertisement

ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్రాల వారిగా బ్యాంకులకు సెలవులు ప్రకటించనున్నారు.అంటే మే నెలలో దాదాపు12 రోజులు పాటు బ్యాంకులు పని చేయవు అన్నమాట.

సెలవులను దృష్టిలో పెట్టుకుని మీ ఆర్ధిక లావాదేవీలను ప్లాన్ చేసుకోండి.అలాగే యాక్సిస్ బ్యాంకు యొక్క కస్టమర్స్ కు ఒక అలెర్ట్.

యాక్సిస్ బ్యాంక్ యొక్క పొదుపు ఖాతాదారులు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి నిర్ధేశించిన అమౌంట్ కంటే ఎక్కువ డబ్బులు విత్ డ్రా చేసుకుంటే గతంలో మాదిరిగా కాకుండా రెండు రెట్లు ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే మే 1 నుంచి బ్యాంకు ఖాతాల్లో ఉండే కనీస మొత్తాన్ని రూ.10,000 నుంచి రూ.15.000కు పెంచింది.అలాగే కరోనా సెకండ్ వేవ్ మధ్య కాలంలో IRDA ఆరోగ్య సంజీవని బీమా పాలసీలో కవర్ చేయాల్సిన మొత్తాన్ని రెండు రెట్లు పెంచింది.అంటే మే నుంచి భీమా కంపెనీలు రూ.10 లక్షల వరకు కవరేజ్ అందిస్తాయి.ఇక ఈ మే నెలలో కోవిడ్ టీకాలకు సంబందించి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి తప్పనిసరిగా కోవిడ్ టీకాలను వేయాలసి ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
కేవలం రెండు అడుగుల స్థలంలో ఇల్లు కట్టిన ఇంజనీర్.. వీడియో చూస్తే..

మారిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కళ్లు కూడా కరోనా వాక్సిన్ వేయించుకోవాలి.

Advertisement

తాజా వార్తలు