పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టే మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ఇంటి చిట్కాలు ఇవే!

డెలివ‌రీ అనంత‌రం పొట్టపై స్ట్రెచ్ మార్క్స్( Stomach Stretch Marks ) ప‌డ‌టం అనేది స‌ర్వ‌సాధార‌ణం.

గర్భధారణ( Delivery ) సమయంలో బేబీ పెరుగుదల వల్ల పొట్ట విస్తరించడం, హార్మోన్ల ప్రభావం వల్ల చర్మం పటుత్వానికి సహాయపడే కోలాజెన్, ఎలాస్టిన్ తక్కువగా ఉత్పత్తి కావ‌డం, శ‌రీర బ‌రువులో మార్పులు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల‌ స్ట్రెచ్ మార్క్స్ ఏర్ప‌డుతుంటాయి.

వీటి వ‌ల్ల కొంద‌రు చాలా ఒత్తిడికి లోన‌వుతుంటారు.కానీ కంగారు పడ‌కండి.

స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టే మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

These Are The Most Powerful Home Remedies To Get Rid Of Stretch Marks On Stomach

టిప్‌-1:

ఒక బౌల్ లో నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెర జెల్‌,( Aloevera Gel ) వ‌న్ టీ స్పూన్ బాదం ఆయిల్‌,( Badam Oil ) వ‌న్ టీ స్పూన్ కోకోన‌ట్ అయిల్‌, వ‌న్ టీ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మంచి మాయిశ్చరైజింగ్‌ క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ఉద‌యం, సాయంత్రం స్నానం చేశాక పొట్ట‌పై అప్లై చేసుకుని మ‌సాజ్ చేసుకోవాలి.రెగ్యుల‌ర్ గా ఇలా చేశారంటే స్కిన్ లో మంచి ఛేంజ్ ఉంటుంది.

Advertisement
These Are The Most Powerful Home Remedies To Get Rid Of Stretch Marks On Stomach

స్ట్రెచ్ మార్క్స్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

These Are The Most Powerful Home Remedies To Get Rid Of Stretch Marks On Stomach

టిప్-2:

రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడ‌ర్( Oats Powder ) లో నాలుగు టేబుల్ స్పూన్లు మ‌జ్జిగ( Butter Milk ) వేసి మిక్స్ చేసి స్క్రబ్‌లా ఉపయోగించాలి.ఐదు నిమిషాల పాటు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో స్క్రిబ్బింగ్ చేసుకుని.ఆపై మ‌రో 15 నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి వాట‌ర్ లో క‌డిగేయాలి.

వారానికి రెండుసార్లు ఇలా చేయండి.ఈ రెమెడీ చర్మాన్ని మృదువుగా మార్చి, కొత్త చర్మ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.

స్ట్రెచ్ మార్క్స్ ను దూరం చేస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

టిప్-3:

ఆలివ్ ఆయిల్‌కు కొద్దిగా నిమ్మరసం( Lemon Juice ) కలిపి స్ట్రెచ్ మార్క్స్ మీద మసాజ్ చేయాలి.30 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.వారానికి రెండు, మూడుసార్లు ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Advertisement

ఇక ఈ చిట్కాల‌ను ఫాలో అవ్వ‌డంతో పాటు చర్మం మృదువుగా, హైడ్రేట్‌గా ఉండటానికి త‌గినంత నీరు తాగండి.విటమిన్ సి, ఇ, ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి.

చర్మం పొడిబారకుండా నిత్యం మాయిశ్చరైజర్ ఉపయోగించండి.స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా మాయం కావడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు.

కాబ‌ట్టి, శ్ర‌ద్ధ‌గా ప్ర‌య‌త్నిస్తే మంచి ఫ‌లితాలు పొందుతారు.

తాజా వార్తలు