గ్యాస్ సమస్య ఉన్నప్పుడు పొర‌పాటున కూడా చేయ‌కూడ‌ని త‌ప్పులు ఇవే!

గ్యాస్ ట్ర‌బుల్‌.( Gas Trouble ) అత్యంత స‌ర్వ‌సాధార‌ణంగా ఇబ్బంది పెట్టే జీర్ణ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

గ్యాస్ స‌మ‌స్య త‌లెత్త‌డానికి కార‌ణాలు అనేకం.అధిక మసాలాలు, డీప్ ఫ్రైడ్ పదార్థాలు ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, ఆహారం తినే స‌మ‌యంలో చేసే పొర‌పాట్లు, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, ఒత్తిడి, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల కొంద‌రు ప్ర‌తినిత్యం గ్యాస్ ప్రాబ్ల‌మ్ తో స‌మ‌మ‌తం అవుతుంటారు.

ఈ నేప‌థ్యంలోనే గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌ప్పుడు పొర‌పాటున కూడా చేయ‌కూడ‌ని త‌ప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.త‌ర‌చూ గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు టీ, కాఫీ, లేదా మద్యం( Tea, Coffee, Alcohol ) ఎక్కువగా తీసుకోవడం చేయ‌కూడదు.

ఎందుకంటే, ఇవి గ్యాస్ ను మ‌రింత పెంచుతాయి.అందువ‌ల్ల టీ, కాఫీ మ‌రియు ఆల్క‌హాల్ ను ఎవైడ్ చేయండి.

Advertisement

అలాగే గ్యాస్ స‌మ‌స్య ఉన్నవారు బీన్స్, పచ్చి క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి ఆహారాలు తీసుకోకూడ‌దు.కొంద‌రు గ్యాస్ రాగ‌నే రిలీఫ్ కోసం సోడా, కోల్డ్ డ్రింక్స్( Cool Drinks ) తాగుతుంటారు.

ఇది చాలా పొర‌పాటు.నిజానికి అటువంటి పానీయాలు జీర్ణక్రియకు క్షీణ‌త‌కు కార‌ణం అవుతాయి.

గ్యాస్ ప్రాబ్ల‌మ్ తో ఇబ్బంది ప‌డేవారు ఎక్కువ మసాలా, కొవ్వు పదార్థాలు, చాక్లెట్స్, కాండీలు తినడం మానుకోవాలి.అలాగే కొంద‌రు తిన్న వెంట‌నే ప‌డుకుంటారు.ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తుంది.

అందువ‌ల్ల భోజ‌నం త‌ర్వాత చిన్న‌పాటి న‌ట‌క గ్యాస్ వంటి జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి ర‌క్షిస్తుంది.శారీరక వ్యాయామం లేకపోవడం కూడా జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది.

'ఇది దేశమా? లేక చెత్త కుప్పా?' భారత్‌ను అవమానించిన బ్రిటీష్ టూరిస్ట్!
తెల్ల అన్నంతో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

అందుకే శ‌రీరానికి త‌గిన శ్ర‌మ ఉండేలా చూసుకోవాలి.

Advertisement

అధిక ఒత్తిడి లేదా ఆందోళన జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ఇది ఎక్కువ గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది.కాబ‌ట్టి, ఒత్తిడికి దూరంగా ఉండండి.

గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు ఆహారాన్ని పెద్ద మొత్తంలో తీసుకోవ‌డం, నీరు త‌క్కువ‌గా తాగ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం మ‌రియు సరిగ్గా కూర్చోకుండా నడుస్తూనే ఆహారం తినడం వంటి త‌ప్పులు అస్సలు చేయ‌కూడ‌దు.గ్యాస్ సమస్య ఉన్నప్పుడు తేలికపాటి, జీర్ణక్రియ సులభంగా అయ్యే ఆహారాలను మాత్రమే తీసుకోండి.

తినేటప్పుడు నిదానంగా, సరిగ్గా కూర్చుని తినండి.త‌ద్వారా గ్యాస్ స‌మ‌స్య‌కు వీలైనంత దూరంగా ఉండొచ్చు.

తాజా వార్తలు