ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌ సీక్రెట్స్ ఇవే.. కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే ఇలా చేయాల్సిందే!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్( Instagram ) యాప్ గురించి ఇక్కడ పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న సోషల్ మీడియా యాప్స్ లలో ఇదే ప్రథమస్థానంలో వుంది.

 These Are The Instagram Algorithm Secrets If You Want The Content To Reach More-TeluguStop.com

క్రియేటర్స్‌కు దీనిద్వారా అత్యధికంగా డబ్బులు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.ఎంత ఎక్కువ మంచి ఫాలోవర్స్ ఉంటే, ఇన్‌ఫ్లుయెన్సర్లకు అంత డిమాండ్ ఉంటుంది ఇక్కడ.

అయితే కంటెంట్ క్రియేటర్స్ ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌ అర్థం చేసుకుంటే, తమ పోస్టుల రీచ్ పెంచుకొని రెవెన్యూ రెట్టింపు చేసుకోవచ్చని చెబుతున్నారు డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు.

Telugu Community, Latest, Ups-Latest News - Telugu

ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌ ( Instagram algorithm ) సాధారణంగా క్లాసిఫైయర్స్, ప్రాసెసెస్, అల్గారిథమ్‌ల కలయిక ఆధారంగా కంటెంట్‌ను ర్యాంక్, రేట్ చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు.స్టోరీస్, ఫీడ్, ఎక్స్‌ప్లోర్‌, సెర్చ్, రీల్స్ వంటి యాప్‌లోని వివిధ సెక్షన్లు యూజర్ ఎక్స్‌పీరియన్స్ పర్సనలైజ్ చేయడానికి నిర్దిష్ట అల్గారిథమ్‌లను ఉపయోగిస్తాయి.ఈ విషయాలను అర్థం చేసుకుంటే క్రియేటర్స్, యూజర్లు ఎక్కువ మందికి రీచ్ కావచ్చని చెబుతున్నారు నిపుణులు.

అవును, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ వివిధ సిగ్నల్స్ ఆధారంగా కంటెంట్‌ను ర్యాంక్ చేస్తుంది.ఈ సిగ్నల్స్‌లో యూజర్ లైక్ చేసిన, షేర్ చేసిన, సేవ్ చేసిన లేదా కామెంట్ చేసిన పోస్ట్‌ల వంటి యాప్‌ యాక్టివిటీస్ ఉంటాయి.

Telugu Community, Latest, Ups-Latest News - Telugu

అంతేకాకుండా, పోస్ట్ పాపులారిటీ, వివరాలు, అలాగే దానిని పోస్ట్ చేసిన వ్యక్తి గురించిన సమాచారం ర్యాంకింగ్‌పై ప్రభావం చూపుతుంది.ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌ అభ్యంతరకరమైన లేదా హానికరమైన కంటెంట్‌ను తీసివేయడానికి కమ్యూనిటీ గైడ్‌లైన్స్( Community Guidelines ) కూడా అమలు చేస్తుందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి.ఈ విషయాలను క్రియేటర్స్ గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడితే ఫీడ్‌లో తమ కంటెంట్ బాగా ర్యాంక్ అయ్యేలా చేసుకోవచ్చు.రీల్స్ ర్యాంకింగ్ అనేవి సేవ్స్‌, రీల్స్ లైక్స్, షేర్స్‌, కామెంట్స్, రీసెంట్ ఎంగేజ్‌మెంట్ సహా యూజర్ యాక్టివిటీ వంటి సిగ్నల్స్ ఆధారంగా ర్యాంక్ చేయబడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube