వేసవిలో ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? చాలా ప్రాణాంతకరమైన..

వేసవికాలంలో( Summer ) వచ్చే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వేసవికాలంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యలలో పడుతూనే ఉంటాం.

కానీ ఆ సమస్యలకు దూరంగా ఉండటం చాలా అవసరం.వేసవిలో ఎండలు ఎక్కువ ఉండడం వలన మనం ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

అయినప్పటికీ చాలామంది వేసవికాలంలో ఎన్నో రకాల సమస్యలకి గురవుతూ ఉంటారు.వేడి వలన ఎన్నో తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు.

ఇక మరికొందరేమో మద్యం సేవిస్తూ ఉంటారు.అయితే వేసవికాలంలో మద్యం( Alcohol ) సేవించడం ఎంతవరకు మంచిదని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వేడి వాతావరణం లో ఆల్కహాల్ లాంటి పానీయాలు నిజంగా ప్రమాదకరం.ఆల్కహాల్ మాత్రమే కాకుండా ఆల్కహాల్ తో కూడిన పానీయాలు కూడా వేసవి కాలంలో తీసుకోవడం చాలా ప్రమాదకరం.

దీనివల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎందుకంటే ఎండాకాలంలో డిహైడ్రేషన్ ( Dehydration ) సమస్య ఎక్కువగా ఉంటుంది.

అయితే ఆల్కహాల్ తీసుకుంటే అప్పుడు డిహైడ్రేషన్ సమస్యను కచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎందుకంటే వేసవికాలంలో హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం.కానీ ఆ సమయంలో ఆల్కహాల్ తీసుకుంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

వేసవి కాలంలో ఆల్కహాల్ తీసుకుంటే వికారం, నీరసం లాంటివి వస్తాయి.అంతేకాకుండా వడదెబ్బ కొట్టడం లాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

వడదెబ్బ వలన స్పృహ కోల్పోవడం, బ్రెయిన్ డ్యామేజ్ లాంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి.

Advertisement

అంతేకాకుండా చనిపోయే అవకాశం కూడా ఉంది.ఎండాకాలంలో ఆల్కహాల్ తీసుకుంటే చర్మ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవాళ్లు దాన్ని తీసుకోకపోవడమే మంచిది.

వీలైనంత వరకు దూరంగా ఉండాలి.హైడ్రేట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి.

ఎల్లప్పుడూ నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు లాంటివి తీసుకోవాలి.ఇవన్నీ తీసుకుంటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

తాజా వార్తలు