అరికాళ్ల కు నెయ్యి రాయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

నెయ్యి( Ghee ) తీసుకోవడం మనిషి ఆరోగ్యానికి( health ) ఎంతో మేలు చేస్తుంది.

అయితే శరీరాన్ని నెయ్యితో మసాజ్ చేస్తే అది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ k వంటి అనేక ముఖ్యమైన పోషకాలు మరియు ఖనిజాలకు అద్భుతమైన మూలం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అయితే నెయ్యితో అరికాళ్ళకు మసాజ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామందికి తెలియదు.

నెయ్యితో అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అరికాళ్ల పై నెయ్యి రుద్దడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా అరికాళ్ల కు నెయ్యి రాసుకోవడం వల్ల శరీరంలో వాత దోషం సమతుల్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇది ఒక వ్యక్తి మంచి నిద్ర పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే అజీర్ణం( Indigestion ), కడుపు ఉబ్బరంగా ఉండి పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

Advertisement

అలాగే రాత్రి నిద్రపోయే ముందు మసాజ్ చేయడం వల్ల గురక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా ఇది శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

కీళ్ల నొప్పుల సమస్య( Joint pain problem ) నుంచి బయట పడేందుకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

దీన్ని అప్లై చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మీరు ఎప్పుడైనా నెయ్యితో శరీరాన్ని మసాజ్ చేయవచ్చు.కానీ ఆయుర్వేదం ప్రకారం రాత్రి నిద్రపోయే ముందు నెయ్యితో అరికాళ్లకు మసాజ్ చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

నిద్రపోయే ముందు మీ పాదాల ను బాగా కడగాలి.పాదాలను పూర్తిగా తుడిచిన తర్వాత అరికాళ్ల కు నెయ్యి రాసి బాగా మసాజ్ చేయాలి.పాదాల అరికాళ్ల మరియు చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా మసాజ్ చేయాలి.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

పాదాలు వెచ్చగా ఉండే వరకు పాదాలపై మసాజ్ చేస్తూ ఉండాలి.ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు