రూ.50వేల లోపు బడ్జెట్ లో దొరికే బెస్ట్ ఫీచర్లు ఉండే 5G స్మార్ట్ ఫోన్లు ఇవే..!

రూ.50వేల లోపు బడ్జెట్ లో పవర్ ఫుల్ గేమింగ్, అద్భుతమైన కెమెరా, రోజంతా ఉండే బ్యాటరీ, అద్భుతమైన డిజైన్ తో ఉండే 5G స్మార్ట్ ఫోన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఐక్యూ నియో 9ప్రో 5G స్మార్ట్ ఫోన్:

( IQ Neo 9Pro 5G Smartphone ) ఈ ఫోన్ 144 Hz ఫ్లాట్ అమోల్డ్ డిస్ ప్లే తో వస్తోంది.స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ను కలిగి ఉంటుంది.5160 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండి, 120W ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.ఇక ఈ ఫోన్ వన్ ప్లస్ 12 ఆర్ మాదిరిగానే ఉంటుంది.

ఈ ఫోన్ పెద్దగా ఉండడంతో పాటు తేలికగా ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.36999 గా ఉంది.

రూ.50వేల లోపు బడ్జెట్ లో దొరికే

వన్ ప్లస్ 12ఆర్ 5G స్మార్ట్ ఫోన్:

( OnePlus 12R 5G Smartphone ) ఈ ఫోన్ 120Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్ ప్లే తో ఉంటుంది.ఈ ఫోన్ లో ఆక్వా టచ్ టెక్నాలజీ ఉంటుంది.కాబట్టి తడి చేతులతో కూడా ఫోన్ ను ఆపరేట్ చేయొచ్చు.5500mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 100W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.అదనంగా ప్రీమియం సూపర్ స్టైలిష్ మెటల్ ఫ్రేమ్ ని కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.39999 గా ఉంది.

రూ.50వేల లోపు బడ్జెట్ లో దొరికే

నథింగ్ ఫోన్ (2) స్మార్ట్ ఫోన్:

( Nothing Phone (2) Smart Phone )ఈ ఫోన్ కూల్ గ్లిఫ్ ఇంటర్ ఫేస్ తో ఐకానిక్ పారదర్శక డిజైన్ ను కలిగి ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.OS 2.5 సాఫ్ట్ వేర్ క్లీన్ గా ఉంటుంది.50ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరాలతో ఉంటుంది.128GB వెర్షన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.35999 గా ఉంది.256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36999 గా ఉంది.512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38999 గా ఉంది.

Advertisement
రూ.50వేల లోపు బడ్జెట్ లో దొరికే
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

తాజా వార్తలు