Tollywood Heroines: పెళ్లి తరువాత భర్తల బలవంతంతో ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు వీళ్లే?

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి పలు సినిమాలలో నటించడం ఇద్దరు ప్రేమలో పడటం సర్వసాధారణంగా జరుగుతున్న విషయం.

ఇలా సినిమాలలో నటించి ప్రేమలో పడి నిజ జీవితంలో కూడా ఒకటైనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించినటువంటి పలువురు హీరోయిన్స్ వారిని పెళ్లి చేసుకుని తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు.అయితే వారి భర్తలకు వారు సినిమాలలో నటించడం ఇష్టం లేకనే ఇండస్ట్రీకి దూరమయ్యారు .భర్తలకు ఇష్టం లేక ఇండస్ట్రీకి దూరమైనటువంటి హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే.

నమ్రత:

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి నమ్రత( Namrata ) తెలుగులో కూడా మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన వంశీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా సమయంలోనే ఈమె మహేష్ బాబుతో ప్రేమలో పడ్డారు ఈ సినిమా తర్వాత కొంతకాలం పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ముంబైలో 2005వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

వివాహానికి ముందే పెళ్లి తర్వాత నమ్రత సినిమాలలో నటించకూడదని తన ఫ్యామిలీకి ఇష్టం లేదని చెప్పడంతో నమ్రత మహేష్ బాబు కోసం సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు.

శాలిని:

తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోయిన్గా నటిస్తే ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న శాలిని ( Shalini ) తమిళ హీరో అజిత్( Ajith ) ప్రేమలో పడ్డారు.ఇలా ప్రేమించుకున్నటువంటి ఈ జంట చెన్నైలో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాలలో నటించడం అజిత్ ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.

Advertisement

ఆసిన్:

గజిని అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించినటువంటి ఆసిన్ (Asin) అనంతరం తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించారు.ఇక ఈమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈవో రాహుల్ శర్మ(Rahul Sharma) అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

అన్షు:

నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో కీలక పాత్రలో నటించిన అన్షు (Anshu) అనంతరం రాఘవేంద్ర సినిమాలో కూడా నటించారు.ఇలా పలు సినిమాలలో నటించినటువంటి ఈమె లండన్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే పెళ్లి తర్వాత తన భర్తకు సినిమాలలో నటించడం ఇష్టం లేకపోవడంతో అన్షు సినిమాలకు దూరంగా ఉంటూ డిజైనింగ్ రంగంలో స్థిరపడ్డారు.

జీవిత:

సీనియర్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జీవిత( Jeevitha ) హీరో రాజశేఖర్ (Rajasekhar) తో కలిసి సినిమాలలో నటించారు.అయితే ఈమె రాజశేఖర్ ను పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సినిమాలలో నటించడానికి రాజశేఖర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో జీవిత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.అయితే హీరోయిన్ గా ఈమె తెర పై సందడి చేయకపోయినా నిర్మాత గాను, డైరెక్టర్ గాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు