అదేంటి గుడంటున్నారు.మరి బీర్ సీసాలతో ఆలయం( Temple with beer bottles ), మూతలలో విగ్రహాన్ని ప్రతిష్టించడం ఏమిటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి.
సాధారణంగా ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఇటుక, ఇసుక, ఇనుము ఉపయెగించి మనం కడతాము.
అలాంటిది పవిత్రమైన ఆలయాన్ని బీర్ సీసాలతో కట్టడమా? అయ్యో రామ! అలాంటి ఘోరాలు మన దేశంలో మాత్రం జరగలేదు కదా అని అనుమానం కలగక మానదు.అయితే ఇది మనదేశంలో జరగలేదు.
థాయిలాండ్( Thailand ) దేశంలో ఇటువంటి కట్టడం వెలసింది.థాయిలాండ్ అనగానే గుర్తొచ్చేవి కొబ్బరిచెట్లు, థాయ్ బీచ్ మసాజ్ సెంటర్లు, బౌద్ధ క్షేత్రాలు.
అవును, అవన్నీ ఒకెత్తయితే వాట్ పా మహా చేడీ క్యూ( Wat pa maha chedi q ) ఆలయం అనేది మరో ఎత్తు.దీని స్పెషాలిటీ ఏమిటంటే? సిమెంట్, ఇటుకలతో కాకుండా.ఏకంగా 15 లక్షల బీర్ బాటిళ్లతో దీని నిర్మాణాన్ని చేపట్టారు.
అందుకే దీనికి మిలియన్ బాటిల్ టెంపుల్( Million Bottle Temple ) అని అక్కడివారు పిలుస్తూ వుంటారు.థాయిలాండ్లోని సిసాకెత్ ప్రావిన్స్లో ఖుసహాన్ జిల్లాలో ఈ ఆలయం కొలువుదీరింది.
సముద్రతీరాల్లో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఖాళీ బీర్ సీసాలను గమనించిన బౌద్ధ సన్యాసులకు ఓ ఆలోచన తట్టింది.ఇటుకలకు బదులుగా బీర్ సీసాలతో అందంగా ఓ గుడిని రూపొందిస్తే బాగుంటుందనుకున్నారు.
అనుకున్నదే తడవుగా ఖాళీ బీర్ సీసాలను సేకరించి, కేవలం రెండేళ్లలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.
ఆలోచన నచ్చడంతో స్థానిక ప్రజలతో పాటు, ప్రభుత్వం కూడా లక్షలాది ఖాళీ బాటిళ్లను సమకూర్చింది.ఆలయ ప్రాంగణంతో పాటు మెట్లు, వాష్ రూంలు, విశ్రాంతి గదులు, ప్రహారీ, నేల, కొలను, నీళ్ల ట్యాంకు.ఇలా అన్నీ సీసాలతో నిర్మించినవే కావడం ఇక్కడి ప్రత్యేకత.
చివరికి శ్మశానవాటికను కూడా వీటితోనే కట్టడం విశేషం.మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బీర్ బాటిళ్ల మూతలను రీసైక్లింగ్ చేసి బుద్ధుడి విగ్రహాన్ని తయారు చేయడం.
నిర్మాణంలో ఆకుపచ్చ రంగు సీసాలను అక్కడక్కడ ఉపయోగిస్తూ, మధ్యలో మట్టి రంగు సీసాలను పేర్చి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.ఈ సీసాలు ఎప్పటికీ రంగును కోల్పోవట.
థాయిలాండ్ వెళ్లే పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణగా మారింది.అక్కడికి వెళ్లిన వారు ఆలయం ముందు నిలబడి ఫొటోలకు ఫోజులిస్తూ తెగ మురిసిపోతుంటారు మరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy