చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న వారిలో నటి రష్మిక ఒకరు.ఈమె తెలుగు తమిళ కన్నడ భాషలతో పాటు హిందీ భాషలో కూడా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఈ మధ్యకాలంలో వరుస వివాదాలలో కూడా చిక్కుకుంటున్నారు.ఈమె తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో తెలియదు కానీ ఈమె చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాలకు కారణం అవుతున్నాయి.
కాంతార సినిమా చూడలేదంటూ ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.ఇంకా ఈ వివాదం గురించి మర్చిపోకముందే సౌత్ సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
దీంతో వరుస వివాదాలను ఎదుర్కొంటున్నారు.అయితే తాజాగా ఈ వివాదాల ద్వారా తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై రష్మిక స్పందించి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే తన గురించి వచ్చే ట్రోల్స్ పై రష్మిక స్పందిస్తూ… సినిమా ఇండస్ట్రీలో చాలా నెగెటివిటీ ఉంటుంది.ఒక యాక్టర్ అయినంత మాత్రాన ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని చెప్పలేం.నేను పబ్లిక్ సెలబ్రిటీని కొన్నిసార్లు నన్ను ఇష్టపడొచ్చు ఇష్టపడకపోవచ్చు.అలాగే నేను మాట్లాడే విధానం కొందరికి నచ్చకపోవచ్చు చేతులతో చేసే సైగలు కొందరికి నచ్చకపోవచ్చు.నా ఎక్స్ప్రెషన్స్ కూడా కొందరికి నచ్చకపోవచ్చు అంటూ ఈ సందర్భంగా తన గురించి ట్రోల్ చేసే వారిపై రష్మిక స్పందించి కామెంట్ చేశారు.ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.