దేశంలో క‌రోనా క‌ల‌క‌లం.. భారీగా పెరుగుతున్న కేసులు

భార‌త్ లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది.దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి.

గ‌డిచిన 24 గంటల్లో 14, 092 కొత్త కేసులు న‌మోదు కాగా, 41 మంది క‌రోనా కాటుకు బ‌ల‌య్యార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.అయితే ప్ర‌స్తుతానికి క‌రోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నాయ‌ని, కేసుల సంఖ్య‌లో త‌గ్గుద‌ల క‌నిపిస్తోంద‌ని వెల్ల‌డించింది.

ఒక్క‌రోజులో 3,81,861 క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా. 14,092 మందికి పాజ‌టివ్ వ‌చ్చింద‌ని తెలిపింది.

దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,27,037 కు చేరింది.అదేవిధంగా దేశంలో 4.42 కోట్ల క‌రోనా కేసులు న‌మోదు కాగా.4.36 కోట్ల మంది కోలుకున్నార‌ని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.క్రియాశీల కేసుల సంఖ్య 1,16,861 గా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Advertisement

అదేవిధంగా దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంద‌ని పేర్కొంది.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు